Varalakshmi Vratham 2021: వరలక్ష్మి వ్రతం...ఇంటిల్లిపాదికి శుభకరం!
Varalakshmi Vratham 2021: వరలక్ష్మీ వ్రతానికి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ రోజున పూజిస్తే వరలక్ష్మీ మాత భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరస్తుందని విశ్వాసం.
Varalakshmi Vratham 2021: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు..తెలుగులొగిళ్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఇళ్లు ఓ ఆలయాన్ని తలపిస్తోంది. పసుపు, కుంకుమాలు, పచ్చని తోరణాలతో ప్రతి ఇంటా లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. ఇక మహిళలు అయితే పూజలు, నోములు, ఉపవాసాలు అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. శ్రావణమాసం(Sravana Masam)లో పౌర్ణమి(Pournami)కి ముందుగా వచ్చే శుక్రవారం(Friday) రోజున అమ్మవారిని వరలక్ష్మిదేవీ రూపంలో పూజిస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని భక్తుల విశ్వాసం.
శ్రావణ వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) శ్రావణ శుద్ధ పౌర్ణమి(Shravan Shuddha Pournami) ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. అప్పుడు కుదరని వారు తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. ఇది మహిళలకు(Women) అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందుకే ఈ రోజు ఏ ఇంట చూసినా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది. సకల సంపదలకూ ప్రతీక లక్ష్మీదేవి(Laxmi Devi). ఆవిడ ఏ మంచిని కోరినా అనుగ్రహించే తల్లి. అందుకే అందరితోనూ వరలక్ష్మిగా పిలిపించుకుంటోంది.
Also Read: Nag Panchami 2021: నాగ పంచమి 2021 తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత
ముఖ్యంగా కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించడం అత్తింటా అనవాయితీ. ఈ పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవ వధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తయిదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవి(Laxmi Devi)ని ప్రార్థిస్తారు.
అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవి(Varalaxmi Devi)కి ప్రత్యేకత ఉంది. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం(Sravana Masam)లో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook