Varuthini Ekadashi Vratam Do's and Do not's: పంచాంగం లెక్కల ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. కృష్ణ పక్షంలో ఒక ఏకాదశి వస్తే శుక్లపక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఇక వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తిధిని వరూధిని ఏకాదశి అంటారు. ఇక ఈ సంవత్సరం వరూధిని ఏకాదశి ఏప్రిల్ 16వ తేదీ వస్తోంది. నిజానికి ఈ వరూధిని ఏకాదశి రోజున వరూధిని ఏకాదశి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అనేక మంచి ఫలితాలు వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరీ ముఖ్యంగా వరూధిని ఏకాదశి వ్రతాన్ని కనుక భక్తిశ్రద్ధలతో ఆచరించి నియమనిష్ఠల ప్రకారం పూజలు చేస్తే అలా చేసిన వ్యక్తికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెబుతారు. అయితే ఏకాదశి ఉపవాసానికి సంబంధించిన నియమాలు చాలా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వరూధిని ఏకాదశి రోజున ముఖ్యంగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు తెలుసుకోవాలి. ఈ క్రమంలో మాకు అందిన సమాచారాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా చదివేయండి. 


ఇదీ చదవండి: Surya Grahana Yogam:రానున్న సూర్యగ్రహణంతో రెండు అశుభ యోగాలు..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!


వరూధిని ఏకాదశి రోజున ఏం చేయాలి అంటే ఆ రోజున శ్రీ లక్ష్మీ సమేత అయిన మహా విష్ణువును పూజించి రోజంతా ఆయననే స్మరిస్తూ ధ్యానంలో ఉండాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. అలాగే ద్వాదశి ముగిసేలోపు ఈ వ్రతాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం మరింత మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి వీలైనన్ని దానాలు చేయడం మంచిది.


ఇక ఈ వరూధిని వ్రతం రోజున మహావిష్ణు ఆరాధనలో ఉండగా ఆయనకు తప్పనిసరిగా తులసిమాలను సమర్పిస్తూ ఉండాలి, ఎందుకంటే మహావిష్ణువుకి తులసి అంటే చాలా ప్రీతిపాత్రం. అయితే అనుకోని సందర్భాలలో మీరు ఉపవాసం ఉండలేకపోయినా ఆరోజు మాత్రం సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మంచిది. వరూధిని ఏకాదశి రోజున మాంసాహారం, మద్యపానానికి మాత్రమే కాదు మత్తు కలిగించే అన్ని పదార్థాలకి, క్రోధం కలిగించే అన్ని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.


అలాగే ఏకాదశి రోజు అన్నం తినడం నిషిద్ధమని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజు మీరు ఉపవాసం ఉండకపోయినా అన్నం తినకుండా ఏవైనా ఫలాలు లేదా మితాహారం తీసుకోవడం మంచిది. అలాగే ఈ వరూధిని ఏకాదశి రోజున క్రోధం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరిమీద పరుష పదజాలం వాడటం కానీ అసభ్య పదజాలం వాడటం కానీ చేయవద్దు. అంతేకాక ఈ వరూధిని ఏకాదశి రోజు బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలని కూడా పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది.


ఇదీ చదవండి: Shukra Gochar 2023: ఈ గ్రహ సంచారంతో మాళవ్య రాజయోగం, వీరు ముట్టింది బంగారం అవ్వక తప్పదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook