Vasant Panchami 2024 In Telugu: ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు మాఘ మాసంలోని శుక్ల పక్షమి 5వ రోజున జరుపుకోవడం ఆనవాయిగా వస్తోంది. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 14వ తేదిన బుధవారం వచ్చింది. ఈ పండగ రోజున సరస్వతి దేవిని పూజించడం చాలా శుభప్రదం. వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించి ఉపవాసాలు చేయడం వల్ల పిల్లలకు తెలివి తేటలు లభించడమే కాకుండా సరస్వతి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ వసంత పంచమి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం రాబోయే వసంత పంచమికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వసంత పంచమి రోజు మూడు ప్రత్యేక యోగాలు:
రవి యోగం:

ఈ 2024 సంవత్సరంలో ఏర్పడబోయే వసంత పంచమి  రవియోగంతో ప్రారంభం రాబోతోంది. ఈ రాశి యోగం ఫిబ్రవరి 14 తేదిన ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10:43 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


రేవతి నక్షత్రం:
వసంత పంచమి రోజు రవి యోగం ఏర్పడడమే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రేవతి నక్షత్రంలో ఈ పండగను జరుపుకోబోతున్నాం. ఈ రేవతీ నక్షత్రం ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:43 గంటల సమయంలో ముగిసే అవకాశాలు ఉన్నాయి. 


అశ్వినీ నక్షత్రం:
దీంతో పాటు ఈ సంవత్సరం రాబోతున్న వసంత పంచమి రోజున అశ్వినీ నక్షత్రం కూడా ప్రారంభం కాబోతుంది. ఇది 10.43 గంటలకు ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుతు తెలిపారు. దీంతో పాటు ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9.26 గంటలకు ముగుస్తుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


వసంత పంచమి 2024 శుభ ముహూర్తం:
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వసంత పంచమి మాఘ శుక్ల పంచమి తేదీన వచ్చింది. కాబట్టి ఈ పండగ ఫిబ్రవరి 13 (ఈ రోజు) మధ్యాహ్నం 02:41 గంటలకు ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. దీంతో పాటు ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుంది. అయితే సరస్వతి దేవిని పూజించాలనుకునేవారు, ఉపవాసాలు ఉండేవారు తప్పకుండా ఉదయం 07 గంటల నుంచి మధ్యాహ్నం 12.41 గంటల సమయంలోనే పూజలు చేయాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter