COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vasant Panchami 2024: ఈ సంవత్సరం రెండవసారి సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో శని గ్రహం సంచార దశలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శని గ్రహాలను శత్రువు గ్రహాలుగా భావిస్తారు. అయితే సూర్య గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయడం వల్ల శని గ్రహం తిరుగమనంలో ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కుంభరాశిలో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో నైతే సూర్యుడు బలంగా ఉంటాడో, వారికి సమాజంలో గౌరవం లభించి, ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు. ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మేషరాశి:
సూర్యుడు శని సంయోగం కారణంగా మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పిల్లల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. దీని కారణంగా కుటుంబ జీవితంలో ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు. ఈ సమయంలో వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు మీ వ్యాపార భాగస్వామి కూడా మీపై ఎంతో నమ్మకంగా ఉంటారు.


వృషభ రాశి:
ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉన్నాయి. ఇక ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా ఉద్యోగులు లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. దీంతో పాటు వృషభ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ఆర్థికంగా కూడా లాభపడతారు.


మిధున రాశి:
ఈ మిధున రాశి వారు కూడా రెండు గ్రహాల సంయోగం కారణంగా జీవితంలో పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో సులభంగా శత్రువులపై విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయాణాలు చేయడం కారణంగా ఆర్థికంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీని కారణంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి అదృష్టం కూడా పెరుగుతుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


కన్యారాశి:
ఈ సమయం కన్యారాశి వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు అనుకోకుండా వచ్చిన నష్టాలు కూడా ఈ సమయంలో డబ్బు తిరిగి పొందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి మధ్య సంబంధం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter