Vasant Panchami 2024: తెలుగు క్యాలెండర్‌ ప్రకారం వసంత పంచమిని మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున జరుపుకోవడం అనవాయితిగా వస్తోంది. ఈ సంవత్సరం పంచమి ఫిబ్రవరి  14 తేదిన వచ్చింది. మత విశ్వాల ప్రకారం ఈ రోజే సరస్వతి మాత జన్మించిందని నమ్ముతారు. అందుకే ఈ రోజుకు ప్రత్యేక ప్రముఖ్యత ఉంటుంది. ఈ రోజు సర్వసతి దేవితో పాటు లక్ష్మిదేవిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే వసంత పంచమి రోజున చాలా పవిత్రమైన యాదృచ్చికం ఏర్పడబోతోంది. ఇదే సమయంలో సర్వార్థ సిద్ధి యోగం, రేవతి నక్షత్రంతో పాటు అశ్వినీ నక్షత్రాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు అదృష్టాన్ని పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
వసంత పంచమి రోజు ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా మేష రాశి వారికి విద్యాకు సంబంధించిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పరిస్థితులు కూడా మారుతాయి. దీని కారణంగా లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే అనేక రకాల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు పనుల్లో ఆటంకాలన్నీ సులభంగా తొలగిపోతాయి.


మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. వసంత పంచమి సందర్భంగా ఏర్పడే నక్షత్రాల కలయిక కారణంగా ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. దీంతో పాటు వృత్తి పరమైన జీవితంలో కూడా అనేక సమస్యలు పరిష్కారమయ్యే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


వృశ్చిక రాశి:
ఈ రాశివారికి వసంత పంచమి సమయంలో ఏర్పడే కొన్ని ప్రత్యేక యోగాల కారణంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. దీని కారణంగా వీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వైవాహిక జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


మీన రాశి:
మీన రాశివారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఉద్యగ, వ్యాపారాల్లో అనుకున్న ఊహించని పురోగతి లభిస్తుంది. దీంతో పాటు ప్రేమ జీవితం గడుపుతున్నవారికి సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా వృత్తి జీవితం గడుపుతున్నవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్‌ కూడా ఉంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter