Vastu Tips: ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం కలిసిరాదు. ఇంకొంతమందికి వేగంగా అంతా కలిసొచ్చేస్తుంటుంది. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంటుంది. దీనంతటికీ కారణం వాస్తు అంటారు జ్యోతిష్య పండితులు. సూర్యాస్తమయం సమయంలో కొన్ని వస్తువులు చూడటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి అత్యంత ధనవంతులౌతారని వాస్తుశాస్త్రం చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అంతా బాగుంటుందని, ధన సంపదలు కలుగుతాయని హిందూమత విశ్వాసం. మరి ఎవరిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంది, ఎవరిపై లేదనేది ఎలా తెలుస్తుందనే సందేహాలుంటాయి. కానీ వాస్తవానికి లక్ష్మీదేవి ఆగమనానికి ముందే కొన్ని సూచనలు, సంకేతాలు కన్పిస్తాయిట. హిందూమతం ప్రకారం లక్ష్మీదేవిని ధనదేవతగా కొలుస్తారు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అంతులేని డబ్బులు వచ్చి పడతాయని నమ్మకం. ఏ ఇంట అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో ఆ ఇంట్లో ధన సంపదలుంటాయంటారు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలా రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం చాలా ఉపాయాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు శాస్త్రాల్లో కొన్ని శుభ సంకేతాలు కూడా ఉన్నాయి. డబ్బులు ఇంట్లో వచ్చే ముందు కొన్ని సంకేతాలు కన్పిస్తాయిట. అవి కూడా సూర్యాస్తమయంతో ముడి పడి ఉంటాయి.


మీ ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుని ఉంటే అత్యంత శుభ శకునంగా భావిస్తారు. పిచ్చుకలు గూడు కట్టుకున్న ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు విస్తరించి ఉంటాయి. ధన సంపదల రాక కూడా అంతకంతకూ పెరుగుతుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 


సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఒకేసారి 3 బల్లుల్ని చూస్తే చాలా శుభ సూచకమని అర్ధం. ఇలా జరిగితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అర్ధమట. లక్ష్మీదేవి వస్తుందంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బుల లభిస్తుందని అర్ధం. అంతేకాదు..ఆ వ్యక్తి సమస్యలన్నీ దాదాపుగా తొలగిపోతాయి.


సూర్యాస్తమయం తరువాత ఎవరి ఇంట్లోనైనా భారీగా నల్ల చీమలు కన్పించినా అత్యంత శుభప్రదమని అర్ధం. నల్ల చీమల దండు కన్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం వెంటనే  కలగనుంది. అందుకే ఆ చీమలకు ఆహారం పెట్టాలంటారు జ్యోతిష్యులు. పిండి లేదా పంచదార పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమౌతుందని అర్ధం. మీకు కలలో బల్లి, గుడ్లగూబ, చీపురు వంటివి కన్పిస్తే అత్యంత శుభమని అర్ధం. ఇలా జరిగితే త్వరలోనే మీకు అంతులేని డబ్బులు లభిస్తాయంటారు. 


Also read: Sun transit 2023: సూర్యుడి అశ్లేష నక్షత్ర పరివర్తనం, ఆ మూడు రాశులకు వద్దంటే డబ్బులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook