Vastu Tips: బాత్‌రూమ్, కిచెన్‌కు కూడా వాస్తు అవసరమా..వాస్తు సూచనలేంటి
Vastu Tips: అందమైన ఇళ్లు అందరి కల. కానీ ఆ ఇళ్లు వాస్తు సరిగ్గా ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది తెలుసుకోవాలి, ఎక్కడ ఏం ఉంచాలనేది అర్ధమవాలి. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం..
Vastu Tips: అందమైన ఇళ్లు అందరి కల. కానీ ఆ ఇళ్లు వాస్తు సరిగ్గా ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది తెలుసుకోవాలి, ఎక్కడ ఏం ఉంచాలనేది అర్ధమవాలి. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం..
ఇంటి నిర్మాణం మాత్రమే కాదు..ఇంటి నిర్మాణంలో వాస్తు సూచనలు తప్పకుండా పాటించాలి. నిర్మాణం తరువాత కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ఇంట్లోని బాత్‌రూమ్, కిచెన్, ప్రేయర్ రూమ్, బెడ్‌రూమ్ విషయంలోవాస్తుశాస్త్రంలో కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. ఆ సూచనలు పాటిస్తే..కుటుంబంలో ఆనందం, సుఖ సంతోషాలు, సంపద అన్నీ లభిస్తాయి.
వాస్తు అనేది కేవలం బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ కోసమే కాదు..బాత్‌రూమ్, కిచెన్, ప్రేయర్ రూమ్స్ వంటి స్థానాలకు కూడా ఉంటుంది. సరైన రంగులు వినియోగించకపోయినా..ఎక్కడ ఏ వస్తువులు అమర్చాలో తెలియకపోయినా ఇంటి ప్రశాంతతపై ప్రభావం పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే బాత్‌రూమ్, కిచెన్, ప్రేయర్ రూమ్స్ విషయంలో వాస్తు సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బాత్‌రూమ్ వాస్తు సూచనలు
ఖాళీ బకెట్ బాత్‌రూమ్‌లో ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఖాళీ బకెట్లు ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు.
నీటితో నింపిన బ్లూ కలర్ బకెట్ బాత్‌రూమ్‌లో ఉంటే సంపద వృద్ధి చెందుతుంది.
వాస్తు ప్రకారం నీలిరంగుకు మహత్యముంది. నీలిరంగు అనేది ఆనందం, పవిత్రతకు సంకేతం. బాత్‌రూమ్‌లో టైల్స్ కూడా నీలిరంగు ఉంటే చాలా మంచి జరుగుతుంది.
కిచెన్ వాస్తు సూచనలు
వాస్తుశాస్త్రం ప్రకారం ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ వంటి రంగులు కిచెన్ రూమ్‌కు మంచి ఫలితాలనిస్తాయి.
డార్క్ గ్రే, బ్రౌన్, బ్లాక్ వంటి రంగుల్ని కిచెన్‌లో వేయకుండా ఉంటే మంచిది. ఇవి పాజిటివ్ ఎనర్జీని నాశనం చేస్తాయి.
అగ్నిదేవుడు నైరుతి మూలన ఉండటం వల్ల కిచెన్ కూడా అదే మూలన ఉండాలి.
నీరు, అగ్ని పరస్పర విరుద్ధ అంశాలైనందున..వాష్ బేసిన్స్, కుకింగ్ వస్తువులైన గ్యాస్ సిలెండర్, ఓవెన్ ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఉంచకూడదు.
ప్రేయర్ రూమ్ వాస్తు సూచనలు
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రార్ధన ఎప్పుడూ నార్త్‌ఈస్ట్ దిశలో ఉండాలి. అక్కడ ఎనర్జీ స్థాపితమై ఉంటుంది.
పూజ గది ఎప్పుడూ బెడ్‌రూమ్‌లో ఉండకూడదు. లేకపోతే ఇంట్లో, కుటుంబసభ్యుల్లో ప్రేమ, ప్రశాంతత లోపిస్తాయి.
చనిపోయినవారి ఫోటోలు ఇంట్లోని పూజగదిలో ఉంచకూడదు.
Also read: Gemstone Benefits: ఆ రత్నం ధరిస్తే..ఇక ఉద్యోగం, పదోన్నతి, డబ్బు అంతా లాభమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook