Vastu Tips and Remedies : ప్రతీ ఇంటి ముందు కాళ్లు తుడుచుకునే పట్టా (డోర్ మ్యాట్) ఉంటుంది. ఇంట్లోకి వెళ్లేటప్పుడు కాళ్లు తుడుచుకుని వెళ్లడం ద్వారా ఇల్లు శుభ్రంగా ఉంటుంది. చెత్త, చెదారం లాంటివి ఇంట్లోకి రావు. అయితే ఈ డోర్ మ్యాట్స్ కేవలం శుభ్రతకే కాదు.. మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని ప్రారదోలేందుకు, చెడు దృష్టి ఆ ఇంటిపై పడకుండా ఉండేందుకు, అప్పుల బారి నుంచి బయటపడేందుకు కూడా దోహదపడుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందుకోసం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డోర్ మ్యాట్ కింద స్పటికం


వాస్తు శాస్త్రం ప్రకారం డోర్ మ్యాట్ కింద స్పటికం ఉంచితే ఆ ఇంటికి మంచిది. ఇందుకోసం స్పటికాన్ని పొడి చేసి ఒక వస్త్రంలో చుట్టి డోర్ మ్యాట్ కింద మధ్య భాగంలో ఉంచాలి. తద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది.


డోర్ మ్యాట్ కింద ఉప్పు


వాస్తు శాస్త్రం ప్రకారం డోర్ మ్యాట్ కింద ఉప్పు ఉంచితే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎటువంటి రోగాలు దరిచేరవు. ఉప్పును ఒక వస్త్రంలో కట్టి డోర్ మ్యాట్ కింద మధ్య భాగంలో దాన్ని ఉంచాలి.  ఇలా చేయడం ద్వారా రోగాలు దరిచేరకపోవడంతో పాటు చెడు దృష్టి బారిన పడకుండా ఉంటారు.


అప్పుల నుంచి బయటపడుతారు


వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్లే 'ఉప్పు'లేదా 'స్పటికం'తో చేసే ఈ నియమాన్నిపాటించాలి. డోర్ మ్యాట్ కింద కొద్దిరోజుల పాటు స్పటికం లేదా ఉప్పును ఒక వస్త్రంలో చుట్టి ఉంచాలి. నిత్యం కొత్త ఉప్పు లేదా స్పటికాన్నిఆ వస్త్రంలో ఉంచాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల అప్పుల బారి నుంచి బయటపడుతారు.


Also Read: Delhi Liquor Scam:లిక్కర్ స్కాంతో కవిత ,రేవంత్ రెడ్డి వ్యాపార బంధం బయటపడిందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా బీజేపీ మాస్టర్ స్ట్రోక్? 


Also Read: Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర పెరిగిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook