Vastu Tips for Home: మనం మన డబ్బు, బంగారు ఆభరణాలను ఇంట్లో లేదా షాపులో ఒక ప్రత్యేకమైన సేఫ్‌లో భద్రపరుస్తాం. అయితే ఈ సేఫ్‌లో లేదా దానికి దగ్గరలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మనం భారీగా నష్టపోతాం. ఇలా కొన్ని సార్లు తెలిసి, తెలియక చేసే పనులు మన దురదృష్టానికి కారణమవుతాయి. వాస్తుశాస్త్రంలో ఈ ఖజానా గురించి కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. ఏయే వస్తువులు సేఫ్ కు దగ్గరలో ఉంచుకూడదో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చీపురు (Broom) : చీపురును సేఫ్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదని నమ్ముతారు. మీరు మీ డబ్బు లేదా విలువైన వస్తువులను భద్రపరిచే దగ్గర చీపురు ఉంచినట్లయితే, మీకు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదు. ఇలా చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది.


నలుపు రంగు దుస్తులు (Black dress): వాస్తుశాస్త్రంలో నలుపు రంగు దుస్తులు అశుభమైనవిగా భావిస్తారు. అందువల్ల వాటిని ఇంటి సేఫ్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. దీనితో పాటు ఖజానాలో ఉంచిన డబ్బు లేదా నగలను నల్ల గుడ్డలో చుట్టకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మికి కోపం వస్తుంది. డబ్బును ఎప్పుడూ ఎర్రటి గుడ్డలో చుట్టి ఖజానాలో ఉంచడం వల్ల మేలు జరుగుతుంది.


మురికి పాత్రలు (Dirty utensils): సేఫ్ దగ్గర ఎప్పుడూ మురికి పాత్రలను పెట్టకూడదు. అశుభ్రమైన చేతులతో సేఫ్‌ను ఎప్పుడూ తాకకూడదు. ఇలా చేయడం వల్ల భారీగా డబ్బును నష్టపోతారు.


Also Read: Mahalaxmi Vratam 2022: మహాలక్ష్మీ వ్రతం ఎప్పుడు, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook