Vastu Tips: ఇంటికైనా..ఆఫీసుకైనా వాస్తు చాలా ముఖ్యమంటారు జ్యోతిష్య పండితులు. ఇంటికి వాస్తుదోషముంటే ఆ వ్యక్తి నాశనమౌతాడట. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు అమలు చేయకపోతే దారిద్య్రం వెంటాడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత కోసం వాస్తు తప్పనిసరి అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే..కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో వాస్తు విషయంలో కొన్ని విషయాలపై దృష్టి పెడితే సుఖమయ జీవితం లభిస్తుందని అంటారు. ఇంట్లోని వాస్తుదోషం సంబంధిత వ్యక్తకి వద్ద డబ్బులు ఆగనివ్వవు. ఎంతగా ప్రయత్నించినా డబ్బులు సంపాదించలేరు. ముఖ్యంగా ఇంట్లో మూడు చోట్ల వాస్తు విషయంలో పక్కాగా జాగ్రత్తలు తీసుకోవల్సిందే.


ఇంటి ఉత్తర దిశ...వాస్తుశాస్త్రం ప్రకారం ఇటి ఉత్తర దిశకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి ఉత్తర దిశ అనేది కుబేరుడు లేదా ధన దేవతకు ఆవాసం. అందుకే ఈ దిశ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఆర్ధికపరమైన విషయాలకు ఉత్తర దిశ శుభప్రదంగా ఉంటుంది. వాస్తు పండితుల ప్రకారం..ఇంటి ఉత్తర దిశగా అశుభ్రంగా ఉంటే..కుబేరుడికి కోపమొస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యక్తి దివాళా తీస్తాడు. 


ఇంటి టాయ్‌లెట్ కూడా శుభ్రంగా ఉండాలి. ఇటీవలి కాలంలో చాలామంది టాయ్‌లెట్లు కూడా ఆధునికంగా మల్చుకుంటున్నారు. కానీ వాస్తు ప్రకారం నిర్మించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి టాయ్‌లెట్ నిర్మాణం లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి టాయ్‌లెట్‌ను దక్షిణ లేదా పశ్చిమ దిశలో నిర్మించాలి. ఇంట్లో టాయ్‌లెట్ ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంటే..ఆ వ్యక్తి ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో డబ్బులు కూడా ఖర్చయిపోతుంటాయి.


నీళ్ల ట్యాంకు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ట్యాంకు వాస్తు ప్రకారం నీళ్ల ట్యాంకు అమర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు వాస్తు పండితులు. ఇంటి ట్యాంకును ఎప్పుడూ దక్షిణం లేదా తుర్పు దిశలో ఉంచడం మంచిది కాదంటున్నారు. మిగిలిన తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. 


Also read: Guru Vakri 2022: బృహస్పతి తిరోగమనం.. ఈ రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook