Vastu Tips: సింగిల్స్ కోసం వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
Flower Remedy For Singles: ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమగల జీవిత భాగస్వామిని పొందాలని కోరుకుంటారు. జీవితంలో తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ప్రతి వ్యక్తి తన కోరిక ప్రకారం వస్తువులను పొందలనుకుంటారు. అయితే ఇలాంటి అంశాలపై వాస్తు శాస్త్రం కొన్ని విషయాలను సూచించింది.
Flower Remedy For Singles: ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమగల జీవిత భాగస్వామిని పొందాలని కోరుకుంటారు. జీవితంలో తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ప్రతి వ్యక్తి తన కోరిక ప్రకారం వస్తువులను పొందలనుకుంటారు. అయితే ఇలాంటి అంశాలపై వాస్తు శాస్త్రం కొన్ని విషయాలను సూచించింది. ఈ అంశాలను పాటించడం ద్వారా.. ఒంటరి వ్యక్తి జీవితంలో ప్రేమ మొదలవుతుందని శాస్త్రం తెలిపింది. మీరు కూడా బ్రహ్మచారైతే, జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లైతే ఈ వాస్తు పరిహారం మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఒంటరి వ్యక్తుల(సింగిల్స్) కోసం కొన్ని అంశాలను సూచించింది. ఆ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రేమ జీవితం కోసం వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?:
#ఒంటరిగా ఉండి భాగస్వామి కోసం వెతుకుతున్న వారు తమ వద్ద తాజా గులాబీ పువ్వును తప్పనిసరిగా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మంచి భాగస్వామిని పొందే అవకాశాలున్నాయని తెలిపారు.
#శుక్రవారం రోజు లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్లి గులాబీ పువ్వులు సమర్పించండం ద్వారా నిజమైన ప్రేమున్న భాగస్వామి లభిస్తుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.
#మీ పడకగదిలో నీటితో నింపిన గాజు గిన్నెను ఉంచి అందులో గులాబీ పువ్వులు వేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలో నిజమైన ప్రేమ కలిగిన భాగస్వామి ప్రవేశిస్తుందని శాస్త్రం పేర్కొంది.
#వాస్తులో పేర్కొన్న విధంగా ట్యూబురోస్ పువ్వులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే మీరు ఈ పువ్వును మీ గదిలో ఉంచడం వల్ల జీవితంలో ప్రేమ అవకాశాలను పెంచుతుందని శాస్త్రం తెలిపింది.
# శాస్త్రం తెలిపిన ప్రకారం..ఎండిపోయిన, పాత పువ్వులను ఇంట్లో ఉంచరాదని తెలిపింది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Do Not Google It: ఇకపై గూగుల్ లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుశిక్ష తప్పదు!
Also Read: OTT Movie Release: OTTలో విడుదల కానున్న మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook