Vastu Tips For Money and Home: ఇంట్లో లేదా షాపులో మీరు డబ్బును భద్రపరిచే చోటు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉన్నట్లయితే అది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని కలగజేస్తుంది. మీ నుంచి ధనం బయటకు వెళ్లడాన్ని అరికడుతుంది. కాబట్టి ఇల్లు లేదా షాపులో ధనాన్ని భద్రపరిచే అల్మారాను సరైన దిశలో ఉండేలా చేసుకోవాలి. కొంతమంది స్థలం ఉంది కదా అని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అల్మారా పెట్టేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైన పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల ధన నష్టం తప్పదు. ఇంట్లో అల్మారాను ఏ దిశలో ఉంచితే ధన నష్టం జరగకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు ప్రకారం ఖజానాను ఈ దిశలో ఉంచండి


వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు డబ్బు దాచుకునే అల్మారా ఉంచే గదికి ఒక తలుపు లేదా రెండు తలుపులు మాత్రమే ఉండాలి. 


వాస్తు ప్రకారం.. ఇంట్లో తూర్పు దిశలో లేదా ఉత్తరం దిశలో అల్మారాను ఉంచడం మంచిది. అల్మారా ముందు భాగం ఉత్తరం వైపు, వెనుక భాగం దక్షిణం వైపు ఉండేలా పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సకల సంపదలకు అధిపతిగా పిలవబడే కుబేరుడు ఉత్తర దిశలోనే ఉంటాడు. అందుకే కుబేరుడిని ఉత్తర దిక్పాలకుడిగా పిలుస్తారు.


వాస్తు ప్రకారం.. మీరు డబ్బు దాచుకునే అల్మారాను ఈశాన్య, ఆగ్నేయ దిశల్లో ఎప్పుడూ ఉంచరాదు. అలా చేయడం అశుభం. అది ఇంటి నుంచి ధనం బయటకు వెళ్లడానికి కారణమవుతుంది. డబ్బు ఇంట్లోకి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంటుంది. వృథా ఖర్చులు పెరిగిపోతాయి.


ఈ నియమాలు పాటించనట్లయితే ఆర్థికంగా మీరు నష్టపోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టకపోవచ్చు. అది మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని పాటించడం ద్వారా మీ పురోగతికి మీరే దోహదం చేసుకున్నట్లవుతుంది.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Nallala Odelu Joins Congress: కాంగ్రెస్‌ గూటికి నల్లాల ఓదెలు.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక.. ఇక బాల్క సుమన్‌తో 'ఢీ'..! 


Also Read: Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.