హిందూమతం ప్రకారం వాస్తుశాస్త్రం సహా చాలా సందర్భాల్లో ఉదయం వేళ కొన్ని ప్రత్యేక విషయాల్ని పాటించాలని ఉంది. అలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి రోజంతా బాగుండి..అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయని విశ్వాసం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తుశాస్తం ప్రకారం ప్రతిరోజూ ఉదయం కొన్ని విషయాల్ని తప్పకుండా అనుసరించాలి. ఇలా చేస్తే ప్రతిరోజూ సుఖంగా సఫలంగా ఉంటుంది. దీనికోసం తొలి నియమం ఉదయం లేచినవెంటనే కొన్ని వస్తువుల్ని చూడకుండా ఉండాలి. ఉదయం వేళ కొన్ని వస్తువుల్ని చూడటం అశుభమని నమ్మకం. కొన్ని వస్తువుల్ని చూడటం వల్ల  మొత్తం రోజంతా నెగెటివ్‌గా ఉంటుంది. జరిగే పనులు కూడా నిలిచిపోతాయి. తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 


ఉదయం వేళ ఎప్పుడూ అడవి జంతువుల్ని లేదా హింసాత్మక దృశ్యాల్ని చూడకూడదు. అందుకే ఇంట్లో హింసాత్మక దృశ్యాలుంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం వేళ కొన్ని ఫోటోల్ని చూడటం అశుభసూచకం.


ఉదయం లేచినప్పుడు మరో వ్యక్తి నీడను పొరపాటున కూడా చూడకూడదు. ప్రత్యేకించి పశ్చిమ దిశ వైపు నీడను చూడటం చాలా అశుభంగా భావిస్తారు. ఇలా జరిగితే ఆ వ్యక్తికి రోజంతా నెగెటివ్‌గా ఉంటుంది.


హిందూమతం ప్రకారం ఎంగిలి గిన్నెలు రాత్రి పూటే శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఎంగిలి గిన్నెలు ఎప్పుడూ చూడకూడదు. దాంతోపాటు రాత్రివేళ ఎంగిలి గిన్నెలు వదిలేస్తే లక్ష్మీదేవి, అన్నపూర్ణల ఆగ్రహానికి కారణమౌతుంది. ఇంట్లో దివాళాతనం వస్తుంది.


హిందూమత గ్రంథాల ప్రకారం ఉదయం లేచిన వెంటనే మీ అరచేతిని చూసుకోవాలి. ఆ తరువాత అరచేయి రుద్దుకుని మీ ముఖానికి రాసుకోవాలి. ఆ తరువాత సూర్య దర్శనం చేసుకోవాలి. ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే చంద్రుడిని కూడా దర్శించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.


Also read: Mars Transit 2023: మరో ఐదురోజుల్లో మారనున్న ఈ 4 రాశుల జాతకం, జనవరి 13 నుంచి అంతా డబ్బే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook