Vastu tips for Money: కొంతమంది డబ్బును ఎంత పొదుపు చేద్దామని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఏదో ఒక రూపంలో ఇంటి నుంచి ధనం బయటకు వెళ్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆకస్మిక ధన నష్టం కూడా కలగవచ్చు. ఇలాంటి పరిస్థితికి చాలా కారణాలు ఉన్నప్పటికీ.. అందులో వాస్తు దోషాన్ని సీరియస్‌గా తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం కొన్ని వాస్తు నియమాలను పాటించాల్సిందిగా సూచిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ దిశలో డబ్బును భద్రపరిస్తే..: 


వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో డబ్బును సరైన స్థలంలో ఉంచకపోతే ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి దక్షిణ దిశలో డబ్బును భద్రపరచవద్దు. దక్షిణ దిశలో అల్మారా లాంటివి ఉంటే.. వాటిని ఉత్తర లేదా తూర్పు దిశకు మార్చి అందులో డబ్బును భద్రపరుచుకోవాలి. తద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం ఆ ఇంటిపై ఉంటుంది. 


ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు :


సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని ఉత్తర దిక్బాలకుడిగా సంబోధిస్తారు. అంటే ఉత్తర దిక్కుకు (Vastu) అధిపతి అని అర్థం. అందుకే ఉత్తర దిశన డబ్బును భద్రపరచడం ద్వారా సంపద పెరుగుతుందని చెబుతుంటారు. కాబట్టి ఇంట్లో డబ్బును ఎప్పుడూ ఉత్తర దిశనే భద్రపరచాలి. అల్మారాను పశ్చిమ దిశలో ఉంచడం ద్వారా కూడా ఆర్థిక నష్టం (Vastu Tips) జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. ఈ నియమాలు పాటించిన కొద్దిరోజులకే మంచి ఫలితాలు పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.


Also Read : Revanth Reddy press meet: మోదీ, నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ బూతులా.. సిగ్గు సిగ్గు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook