Ganapati Idol Vastu Tips: ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఆ దిక్కున ఉంచితే అదృష్టం మీ తలుపు తడుతుంది!

Vastu Tips: ప్రతి ఇంట్లో ఏర్పడే సమస్యలు, దోషాలను తొలగించేందుకు గణేశుడిని పూజిస్తారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాల్లో వినాయకుని విగ్రహం ప్రతిష్టించడం శుభప్రదమని తెలుస్తోంది.
Ganapati Idol Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని విషయాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఇల్లు, అందులో వారికి దోషాలను కూడా వాస్తు తొలగిస్తుంది. ఈ క్రమంలో ఇంటి వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గణపతిని ప్రసన్నం చేసుకోవడం వల్ల జీవితంలో దుఃఖం, బాధ ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది. దాంతో పాటు జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కాబట్టి, మీ ఇంట్లో గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అయితే అదే సమయంలో గణపతి ప్రతిమ ప్రతిష్టకు తగిన నియమాలను పాటించాలి.
ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచాలి?
ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు విగ్రహం సరైన దిశలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గణపతి విగ్రహాన్ని ఉంచడానికి ఉత్తమమైన దిక్కు ఇంటి ఈశాన్య మూల. ఇక్కడ గణపతి విగ్రహాన్ని ఉంచడం సాధ్యం కాకపోతే.. ఉత్తరం లేదా తూర్పు దిశను ఎంచుకోవాలి.
కానీ పొరపాటున కూడా వినాయకుని విగ్రహాన్ని దక్షిణ దిశలో ప్రతిష్టించ కూడదు. ఈ దిశ దేవతలను పూజించడానికి అశుభమైనదిగా వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, విగ్రహాన్ని ప్రతిష్టించిన చోట లేదా ఆ పరిసరాల్లో మురికి, చెత్త లేదా మరుగుదొడ్డి ఉండరాదు.
మెటల్ లేదా మట్టి విగ్రహం
విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు.. విగ్రహాన్ని మట్టి, ఆవు పేడ లేదా లోహంతో తయారు చేసినదై ఉండాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా గాజు విగ్రహాన్ని ఎప్పుడూ ప్రతిష్టకూడదు. దేవతా విగ్రహాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన లోహం లేదా మట్టితో ఉండాలి. అప్పుడే వారు ఇంట్లో ఆనందం, శ్రేయస్సును లభిస్తుంది.
గణపతి విగ్రహం ప్రతిష్టతో దోషాలు తొలగింపు..
ఇంట్లో గొడవలు, ఆర్థిక నష్టం, జీవితం కష్టాలు చుట్టుముట్టినట్లయితే, ఇంటి వాస్తు దోషాలు దీనికి ప్రధాన కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా డోర్ ఫ్రేమ్ పైన లేదా ప్రవేశ ద్వారం ముందు రెండు గణపతి విగ్రహాలు ప్రతిష్టించాలి.
ఒక విగ్రహం ఇంటి లోపలి వైపునకు.. మరొకటి ఇంటి వెలుపలి వైపు ముఖం ఉండేలా చూడాలి. ఆ రెండు విగ్రహాలు లేదా ప్రతిమలు సమాన పరిమాణం, ఆకారంలో ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Shani Jayanti 2022: శని జయంతి నాడు మీ రాశి ప్రకారం దానం చేస్తే... మీ కోరికలు తప్పక నెరవేరుతాయి!
Also Read: Samudra Shastra: చేతికి 6 వేళ్లు ఉన్నవారు గురించి సముద్ర శాస్త్రం ఏం చెబుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook