Vastu Tips: ఇంట్లో లాఫింగ్ బుద్ధను ఏ దిశలో ఉంచితే శుభం జరుగుతుందో తెలుసా...
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. సరైన దిశలో లాఫింగ్ బుద్ధను ఉంచకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధకి చాలా ప్రత్యేకత ఉంది. లాఫింగ్ బుద్ధను ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధని సరైన దిశలో ఉంచకపోతే అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతారు. వాస్తు రీత్యా లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు లాఫింగ్ బుద్ధను ఉంచితే... ఇంట్లోకి ఎవరు అడుగుపెట్టినా.. వారి కళ్లు ముందుగా లాఫింగ్ బుద్ధ వైపు వెళ్తాయి. ఆ వ్యక్తితో పాటు వచ్చే ప్రతికూల శక్తి ప్రధాన ద్వారం వద్దే ముగుస్తుంది. లాఫింగ్ బుద్ధను ఇంటి మెయిన్ డోర్ ముందు కనీసం 30 అంగుళాలు, గరిష్టంగా 32.5 అంగుళాల ఎత్తులో ఉంచాలి. తద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఇంట్లో లాఫింగ్ బుద్ధను సరైన దిశలో ఉంచకపోతే దుష్ప్రభావాలు తప్పవు.
ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం ముందు లాఫింగ్ బుద్ధను పెట్టలేకపోతే సూర్య దేవుడు ఉదయించే తూర్పు దిశలో పెట్టుకోవచ్చు. లాఫింగ్ బుద్ధను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వంటగది, డైనింగ్ ఏరియా, బెడ్‌రూమ్ లేదా టాయిలెట్ సమీపంలో లాఫింగ్ బుద్ధను ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపించి అశుభం కలుగుతుంది. లాఫింగ్ బుద్ధను సరైన దిశలో ఉంచడం ద్వారా ఆ ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి.
Also Read: IPL 2022 Final GT vs RR Live Updates: నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. బట్లర్ ఔట్!
Also Read : Sai Pallavi: సాయి పల్లవి డెడికేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పిన విరాటపర్వం డైరెక్టర్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook