Vastu for Home: గులాబీలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే ఆ అందమే వేరు. విరబూసే గులాబీలు ఇంటికి కూడా అందాన్ని తీసుకొస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్కను సరైన దిశలో ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు ప్రారదోలబడుతుంది. కాబట్టి గులాబీ మొక్కను ఇంట్లో ఏ దిశలో ఉంచాలో ఇక్కడ తెలుసుకోండి.
 
ఇంట్లో గులాబీ మొక్కను ఏ దిశలో ఉంచాలి :


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి దిక్కున గులాబీ మొక్కను ఉంచడం మంచిది. ఇంటికి దక్షిణం వైపు ఎర్రటి పూలు ఉంటే ఆ ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి. 


మీరు వేసవిలో గులాబీ మొక్కను ఆరుబయట పెట్టినట్లయితే.. ముందుగా మొక్క నీడలో ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత నిధానంగా ఎండలోకి తరలిస్తే సూర్యరశ్మి వల్ల గులాబీ మొక్క సురక్షితంగా పెరుగుతుంది.


గులాబీ మొక్కను ఇంటి లోపల నిల్వ ఉంచినట్లయితే, దానికి తగిన సూర్యకాంతి అందేలా చూసుకోండి. మొక్కకు రోజుకు కనీసం ఆరు గంటల సూర్యరశ్మి ఉండేలా చూసుకోండి. ఇందుకోసం మొక్కను కిటికీకి దక్షిణం లేదా పడమర వైపు ఉంచండి.


మొక్కలపై సాలీడు గూళ్లు పెట్టకుండా జాగ్రత్తపడాలి. వాతావరణం పొడిగా ఉంటే, గులాబీ మొక్కలు సాలీడు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి.. నీటిలో నానబెట్టిన గులకరాళ్ళ ట్రే పైన మీ మొక్కను ఉంచండి. నీరు ఆవిరై, తేమ పెరుగుతుంది. తద్వారా సాలీడు గూళ్లు పెట్టకుండా ఉంటాయి.


అలాగే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వాడిపోయిన పూలను ఎప్పటికప్పుడు తొలగించాలి. అలాగే వాడిపోయిన ఆకులు కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి. తద్వారా చెత్త పేరుకు పోకుండా ఉంటుంది.


(గమనిక : ఈ వ్యాసం వాస్తు నిపుణుల అభిప్రాయాలు లేదా సాధారణ అంచనాలను ప్రతిబించవచ్చు.దీనిని జీ న్యూస్ ధ్రువీకరించలేదు.)


Also Read: Qinwen Zheng: ఫ్రెంచ్ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపై చైనా ప్లేయర్ హార్ట్ టచింగ్ కామెంట్స్...


Also Read: Atmakur Bypoll: ఆత్మకూరు బైపోల్ కు టీడీపీ దూరం.. బీజేపీ కోసమేనా.. పొత్తుకు ముందస్తు వ్యూహమా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook