Vastu Tips: రుణం నుంచి బయట పడటానికి వాస్తు చిట్కాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు పెద్దలు. ఇంట్లో సరైన విధానాలను అవలంభిస్తే రుణం భారం నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. మనిషి జీవితంలో ఈఎమ్‌ఐలు భాగమయ్యాయి. ప్రతి నెలా ఏదో ఒకదానికి ఈఎమ్‌ఐలు చెల్లిస్తుంటాం. ఒక్కోసారి అప్పుల ఊబిలోనూ కురుకుపోతుంటాం. కానీ ఇంట్లో సరైన వాస్తు పద్ధతులు పాటిస్తే అప్పుల నుంచి బయటపడొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుణం నుంచి బయట పడేందుకు చిట్కాలు..


-ఇంటి ఈశాన్య దిశలో అంటే ఈశాన్యంలో వాస్తు దోషం ఉంటే రుణ భారంగా పెరుగుతుంది. ఈ లోపం వల్ల స్టాక్‌ మార్కెట్, జూదం, బెట్టింగ్, లాటరీ నుంచి సంపాదించాలనే దురాశ ఇంటి పెద్దలో కల్గుతుంది. ఇంటి పెద్దను తప్పు చేసేలా చేస్తుంది. అప్పుల్లో మునిగిపోతాడు. 


-వాయవ్య దిశలో వాస్తు దోషం ఉంటే..ఆ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండానే అప్పుల ఊబిలో పడిపోతాడు. తెలియకుండానే తప్పు చేస్తాడు. ఇది భవిష్యత్తులో భారం అవుతుంది. ఈ దిశలో ఇంటి పెద్ద యొక్క పడక గదిని కల్గి ఉండటం కూడా అతడ్ని వ్యాపారంలో నష్టాన్ని కల్గిస్తుంది. 


-ఆగ్నేయ దిశలో లోపం ఖర్చులను పెంచుతుంది. దీని వల్ల అతడు రుణం తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఇంటి పెద్ద పడక గది వాయవ్య దిశలో ఉన్నట్లయితే..వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల రుణం తీసుకునే పరిస్థితి ఉంటుంది. 


-ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్‌రూమ్‌ కూడా అప్పులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ ప్రాంతంలో గాజు దిన్నెలో సముద్రపు ఉప్పును ఉంచి ఎప్పటికప్పుడు ఉప్పును మార్చడం చేయాలి.


-రాత్రి పూట వంట గదిని మురికిగా వదిలేయడం, ఉంచిన పాత్రలను విడిచి పెట్టడం కూడా రుణాన్ని కారణమవుతుంది. పేదరికాన్ని తీసుకోస్తుంది. 


రుణాలను త్వరగా చెల్లించే మార్గాలు..


మీకు అప్పులు ఉంటే ప్రతి వాయిదా ముందే చెల్లించండి. ఇలా చేయడం వల్ల రుణాన్ని భారం నుంచి తొందరగా బయటపడొచ్చు. దీంతోపాటు మంగళవారం హనుమంతుడికి సింధూరం సమర్పించడం కూడా రుణం నుంచి ఉపశమనం కల్గిస్తుంది. 


Also read:Ganga Dussehra 2022: గంగా దసరా రోజు ఇలా చేయండి..సకల భాగ్యాలు కల్గుతాయి..!


Also read:Godse Movie Trailer: అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి! మర్యాద ఉన్నోడే..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook