Vastu tips for Good luck: వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పాజిటివ్‌నెస్ తీసుకొస్తే..మరికొన్ని నెగెటివ్ శక్తులకు ఊతమిస్తాయి. వాస్తుశాస్త్రంలో ఓ పక్షి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఫోటో ఇంట్లో ప్రత్యేకమై దిశలో పెట్టుకుంటే..అంతా శుభం జరుగుతుందట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉపయోగించే చాలా వస్తువులను సరైన దిశలో అమర్చుకోవల్సి ఉంటుంది. తప్పుడు దిశలో కొన్ని వస్తువుల్ని పెట్టడం వల్ల అనర్ధాలు ఎదురౌతాయి. వాస్తు ప్రకారం ఉంటేనే ఏదైనా సరే మంచి ఫలితాలనిస్తుందనేది వాస్తు పండితులు చెప్పే మాట. ఇంట్లోని చాలా వస్తువులు ఇలాగే పాజిటివ్ లేదా నెగెటివ్ శక్తులకు కేంద్రంగా ఉంటుంటాయి. కానీ వాస్తు నియమాల ప్రకారం ఉంటే నెగెటివ్ శక్తి కూడా పాజిటివ్‌గా మారుతుంది. 


వాస్తు పండితులు చెప్పిందాని ప్రకారం..ఇంట్లో అమర్చుకునే ఫోటోలూ కూడా వ్యక్తి జీవితంలో శుభం లేదా అశుభానికి సంకేతాలుగా ఉంటాయి. ఇంట్లో యుద్ధం లేదా హింసాయుత జంతువులు, లేదా పక్షుల ఫోటోలు అమర్చడం వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తులు ప్రసరిస్తాయి. దాంతోపాటు ఇంట్లో వాస్తుదోషం ఉత్పన్నమవుతుంది. ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి ప్రభావితమౌతుంది. అయితే మరి ఇంట్లో ఏ పక్షి ఫోటో పెట్టుకుంటే అంతులేని లాభాలు కలుగుతాయో చూద్దాం.


వాస్తుప్రకారం ఇంటి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి ఫోటో అమర్చడం శుభప్రదం. ఈ ఫోటోను ఇంట్లో అమర్చడం వల్ల  పాజిటివ్ శక్తులు ప్రసరిస్తాయి. నెగెటివ్ శక్తులు దూరమౌతాయి. ఇంట్లోని లివింగ్ రూమ్‌లో దక్షిణ దిశలో అమర్చుకోవాలంటున్నారు వాస్తు పండితులు. దీనివల్ల ఇంట్లో సభ్యులందరి దృష్టి ఈ ఫోటోపై పడి..ప్రయోజనాలు చేకూరుతాయి. ఫీనిక్స్ పక్షి అనేది అగ్ని, ప్రసిద్ధత, అభివృద్ధికి సంకేతమని చెబుతారు. అభివృద్ధి పథాన ఎదురయ్యే ఇబ్బందులు తొలగించడంలో, వాస్తు దోషాల్నించి విముక్తి చేయడంలో ఫీనిక్స్ పక్షి ఫోటో ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటి దక్షిణ దిశలో ఈ ఫోటో అమర్చడం చాలా లాభదాయకం.


ఇంట్లో ఫీనిక్స్ పక్షి ఫోటో అమర్చడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది లేదా తిరిగొస్తుంది. అటు ఇంట్లో కుటుంబసభ్యులకు కూడా ఎనర్జీ లభిస్తుంది. ఫీనిక్స్ పక్షిని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందులో ఇంట్లో అమర్చుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అగ్నిని ప్రాతినిధ్యం వహించే పక్షి కాబట్టి..వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని దూరం చేస్తుంది. 


Also read: Astro Remedies: ఆర్ధికంగా చితికిపోయున్నారా..రూపాయి నాణెంతో ఇలా చేస్తే చాలు, అదృష్టం మారిపోతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook