Venus-Moon Conjunction 2022: మరో 24 గంటల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా!
Shukra-Chandra Yuti Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఈ కలయిక కొన్ని రాశుల వారికి శుభం మరియు కొందరికి అశుభం. కర్కాటక రాశిలో ఏర్పడిన శుక్రుడు మరియు చంద్రుని కలయిక వల్ల మూడు రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
Shukra-Chandra Yuti Benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఒక గ్రహం అదే రాశిలోని మరొక గ్రహంతో కలవడాన్ని సంయోగం అంటారు. ఈ గ్రహాల కలయిక ప్రభావం శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. రేపు అంటే ఆగస్టు 24న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శుక్రుడు అదేరాశిలో ఉన్నాడు. వీటి కలయిక ముఖ్యంగా మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంద. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries)- శుక్ర చంద్రుడు కలయిక ఈ రాశివారికి చాలా లాభాలను తెస్తుంది. ఈ రాశిలో ఈ సంయోగం నాల్గవ స్థానంలో ఏర్పడుతోంది. దీని వల్ల ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.
కర్కాటకం (Cancer)- ఈ రాశిచక్రం యొక్క జాతకంలో లగ్నస్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. మీరు ప్రేమలో విజయం సాధిస్తారు. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. అదృష్టంతో అన్ని పనులలో విజయం సాధిస్తారు. చంద్ర రాయిని ధరిస్తే మీకు మేలు జరుగుతుంది.
కన్య (Virgo)- శుక్ర, చంద్రుల కలయిక వల్ల ఈ రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి యెుక్క 11వ స్థానంలో ఈ సంయోగం ఏర్పడుతోంది. ఈ ప్రదేశాన్ని ఆదాయం, లాభాల స్థలంగా పేర్కొంటారు. మీరు అనేక విధాలుగా డబ్బు సంపాదిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read: మార్గి శని ఎఫెక్ట్... అక్టోబరు 23 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook