Venus And Rahu Ki Yuti: గ్రహాల పరివర్తనం ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. హోలీ పండుగ ముగిసిన మూడు రోజులకు అంటే మార్చి 12న లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే ఛాయా గ్రహం లేదా దుష్ట గ్రహమైన రాహువు అదే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. వీటి సంయోగం సమయంలో ముఖ్యంగా మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
శుక్రుడు మరియు రాహువు కలయిక కన్య రాశి వారికి హానికరం. ఈ రెండు గ్రహాల సంయోగం కన్యారాశిలోని ఎనిమిదో ఇంట్లో జరగబోతుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వృద్ధుల హెల్త్ పట్ల శ్రద్ద తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీకు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. 
మేషరాశి 
రాహువు మరియు శుక్రుడు సంయోగం మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి. మీ రాశితో లగ్నస్థ గృహంలో ఈ కూటమి జరగబోతుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. మీ లైప్ పార్టనర్ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 
మీనరాశి
మీనరాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఇబ్బందులు ఎదురువుతాయి. మీరు రుణ విముక్తి పొందలేరు. ఫ్యామిలీ సపోర్టు లభించదు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు రుణం నుండి బయటపడలేరు. 


Also Read: రాములోరి భక్తులకు శుభవార్త... ఇవాల్టి నుంచే ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణ టికెట్లు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.