Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ రాశులకు డబ్బే డబ్బు..
Shukra Gochar 2022: నవంబర్ 11 నుంచి శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
Shukra Gochar 2022: ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మారుస్తుంది. ఇది మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 11వ తేదీన శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం తులరాశిలో ఉన్న శుక్రుడు వృశ్చికరాశిలోకి (Venus enters in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. ప్రేమ, శృంగారం, సంపద, ఆనందం, లగ్జరీ లైఫ్ కు ఇచ్చే దేవుడు శుక్రుడు. వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మకరరాశి (Capricorn): నవంబర్ 11 నుండి మకర రాశి వారి అదృష్టం తెరుచుకోనుంది. సమాజంలో వీరి ప్రతిష్ట పెరగనుంది. ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. మెుత్తంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది.
సింహం (Leo): శుక్రుని రాశిలో మార్పు సింహ రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. నవంబర్ 11 తర్వాత సింహ రాశికి అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పని చేస్తే, అది లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కాలంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
తులారాశి (Libra): శుక్రుడి రాశి మార్పు వల్ల తులరాశి వారు శుభవార్త వింటారు. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
కుంభ రాశి (Aquarius): కుంభ రాశి వారికి శుక్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఇచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో మీ పనిపట్ల బాస్ సంతృప్తి చెందుతాడు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా కుంభరాశివారికి శుక్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుని రాశిలో మార్పు ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
Also Read: Lunar Eclipse 2022: ఏడాది చివరి చంద్రగ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, ఆ ఐదు రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook