Venus In Ardra Nakshatra: ఆరుద్ర నక్షత్రంలోకి శుక్రుడు సంచారం చేయబోతోంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, సంతోషానికి సూచికగా భావిస్తారు. అలాగే ఈ గ్రహాన్ని గౌరవానికి కారణంగా కూడా చెప్పుకుంటారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం జూన్‌ 12వ తేదిన మిథున రాశిలోకి సంచారం చేసింది. అయితే ఇది ఇలా ఉండగా.. ఈ శుక్ర గ్రహం జూన్ 18వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. శుక్రుడు ఈ నక్షత్రంలో జూన్ 29వ తేదీ వరకు సంచార దశలోనే ఉండబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వృత్తిపరమైన జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అయితే శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయో.. ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి: 
మేష రాశి వారికి శుక్రుడు నక్షత్ర సంచారం కారణంగా అనేకమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దీంతోపాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతంగా లాభాలు పొందగలుగుతారు. దీంతోపాటు ఈ రాశి వారికి సౌకర్యం సౌలభ్యం కూడా పెరిగి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. 


సింహరాశి: 
ఆరుద్ర నక్షత్రం లోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా సింహ రాశి వారికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇప్పటివరకు ఉన్న అడ్డుకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా గొప్ప విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త జాబ్ ఆఫర్స్ కూడా వస్తాయి. దీంతో పాటు ఆకస్మికంగా అనేక లాభాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో ఎక్కువగా పెట్టుబడును పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. 


తులారాశి: 
తులా రాశి వారికి కూడా శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం కారణంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనేక మూలల నుంచి కొత్త ఆదాయ వనరులు పుట్టుకు వస్తాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో విపరీతమైన డబ్బు కూడా పొందుతారు. అలాగే నిలిచిపోయిన ధనం కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది. దీంతో పాటు బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. దీంతోపాటు వ్యాపారాలన్నీ ఎంతో లాభసాటిగా ఉంటాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మకర రాశి: 
ఆరుద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా మకర రాశి వారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంచార ప్రభావం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఐశ్వర్యం సంతోషం పెరగడమే కాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఎప్పటినుంచో వస్తున్న కుటుంబ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అలాగే భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో శుభ్రంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం పెరగడమే కాకుండా శాంతి సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే జీవిత అభివృద్ధికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి