Shukra Gochar 2023: ఫిబ్రవరి 25 వరకు శనిదేవుడి రాశిలోనే శుక్రుడు.. ఇక ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..

Shukra Gochar 2023: వేద పంచాంగం ప్రకారం, రెండు రోజుల కిందట శుక్ర గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించింది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Venus Planet Transit In Kumbh: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని గ్రహాలు ఒకదానితో ఒకటి స్నేహం కలిగి ఉంటాయి మరియు కొన్నింటికి శత్రుత్వం ఉంటుంది. జనవరి 22న శుక్ర గ్రహం కుంభరాశిలో సంచరించింది. అదే రాశిలో వచ్చే నెల ఫిబ్రవరి 22 వరకు శుక్రుడు ఉంటాడు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ప్రస్తుతం అదే రాశిలో సంచరించస్తున్నాడు. పైగా శుక్రుడు, శని మిత్రులు. కుంభరాశిలో ఈ రెండు ఉండటం వల్ల మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
తులా రాశిచక్రం (Libra)
శుక్రుడి రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఐదో ఇంట్లో సంచరించింది. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీతో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశిచక్రం (Scorpio)
శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి సంతోష స్థానానికి మారాడు. అందుకే ఈ సమయంలో మీ సుఖాలు పెరుగుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా వస్తువను కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ కుటుంబంతో సంబంధాలు బలపడతాయి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగం మరియు వ్యాపార పరంగా శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ ఇంటిపైకి ప్రవేశించింది. అందుకే ఈ సమయంలో మీరు వ్యాపారంలో కొత్త అవకాశాలను అందుకుంటారు. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. సహచరుల మద్దతు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Budh Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook