Shukra Gochar 2022: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరో 5 రోజుల్లో అంటే డిసెంబర్ 29న శుక్ర గ్రహం మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ప్రేమ, శృంగారం, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు శుక్రుడు కారకుడు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. మకర రాశిలో శుక్రుడి సంచారం (Shukra Gochar 2022) మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశిచక్రం (Aries): శుక్రుని రాశిలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి పదో ఇంట్లో సంచరించబోతోంది. అందుకే ఈ శుక్ర సంచారం మీకు కెరీర్ లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో మీ సహోద్యోగులు సపోర్టు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


మిథునం (Gemini): శుక్రుడు సంచరించిన వెంటనే మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఎనిమిదో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు లాభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దానిని బయటపడతారు. 


మకర రాశిచక్రం (Capricorn): శుక్రుని సంచారం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 


Also Read: Rahu Ketu Gochar 2023: రాహు-కేతు గ్రహాల గమనంలో మార్పు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.