Shukra gochar 2023: ఈ నెల చివరిలో కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..
Shukra gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023 effect: లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా మిథునరాశిలోకి ప్రవేశించాడు. ఈ నెల 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. జూలై 07 వరకు శుక్రుడు అదే రాశిలో సంచరించనున్నాడు. అనంతరం శుక్రదేవుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి గోచారం నాలుగు రాశులవారికి మేలు చేయనుంది.
వృశ్చిక రాశి
శుక్ర గ్రహం యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.
మీన రాశి
శుక్రుని గోచారం మీనరాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు.
మేష రాశి
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల మేషరాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఉద్యోగులకు మంచి జీతంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు.
Also Read: Satrun Retrograde 2023: శనిదేవుడి రివర్స్ కదలిక... ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook