Shukra Gochar Benefits: ఆస్ట్రాలజీలో సంపద, లగ్జరీ మరియు అందం యొక్క గ్రహంగా శుక్రుడిని భావిస్తారు. ఫిబ్రవరి15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 12 వరకు అదే రాశిలోనే ఉంటాడు. సాధారణంగా మీనరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడి మీన సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశిలో శుక్రుని సంచారం అదృష్ట ఇంట్లో ఉంటుంది. ఇక్కడ బృహస్పతి కూడా ఉన్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు సమస్యల నుండి బయటపడతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం.
సింహరాశి (Leo)
శుక్రుని సంచారం కారణంగా మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. మెుత్తానికి శుక్రుడి సంచారం మీకు అద్భుతంగా ఉంటుంది. 
కన్య (virgo)
కన్యా రాశి వారి బిజినెస్ విస్తరిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ వ్యక్తిత్వం పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. 


వృశ్చిక రాశి (Scorpio)
ఈ శుక్రుని సంచారం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ సమయం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
కుంభ రాశి (Aquarius)
శుక్రుడి గోచారం వల్ల మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆస్తి లావాదేవీలు లాభిస్తాయి. మీ పరిస్థితి ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేదా వివాహం జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.
మీనరాశి (Pisces)
ఈ శుక్ర సంచారం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి.  బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


Also Read: Rahu Gochar 2023: అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశించనున్న రాహు గ్రహం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook