Shukra Gochar 2023: లవ్, సంపద మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రదేవుడు ఈనెల 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆస్ట్రాలజీలో శుక్రుడి సంచారం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. మీనరాశిలో శుక్రుడి ఎంటర్ అవుతున్న కారణంగా అరుదైన 'మాలవీయ మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం ఫిబ్రవరి 15 నుంచి కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య (Virgo): శుక్రుడి గోచారం వల్ల ఏర్పడిన మాళవ్య యోగం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈయోగం వల్ల వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు భారీగా డబ్బును పొందుతారు. 
మిథున రాశి (Gemini) : శుక్రుని రాశి మార్పు మిథునరాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. మెుత్తానికి మీకు టైం కలిసి వచ్చి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. 
 ధనుస్సు (Sagittarius): మాళవ్య రాజయోగం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది. 


కుంభ రాశి (Aquaris) : శుక్రుని సంచారం కుంభ రాశి వారికి బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే బాగుంటుంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. జాబ్ ఉన్నవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి (Cancer) : శుక్రుని సంచారం ఈరాశివారికి అనుకూలం. మీకు లక్ కలిసి వస్తంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.  మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 


Also Read: Surya Gochar 2023: 'శని' రాశిలో అరుదైన కలయిక... ఈరాశులకు అదృష్టమే ఇక... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook