Shukra Vakri 2023 effect: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం సూర్యుడి రాశి అయిన సింహరాశిలో తిరోగమన దిశలో కదలుతున్నాడు. ఆగస్టు 07 వరకు అదే స్థితిలో ఉంటాడు. సాధారణంగా గ్రహాల తిరోగమనం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కానీ తిరోగమన శుక్రుడు నాలుగు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి - తులారాశికి కూడా శుక్రుడినే అధిపతిగా భావిస్తారు. శుక్రుడి రివర్స్ కదలిక వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈసమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. 


మిథునం- శుక్రుని వక్రీ మిథునరాశి వారికి కలిసి వస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి.. వాటిని త్వరగా పూర్తి చేస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.


వృషభం - ఈరాశికి అధిపతి శుక్రుడు. ఇతడి తిరోగమనం వృషభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. డబ్బును ఆదా చేస్తారు. మీకు స్థిరచరాస్తులు లభిస్తాయి. 


Also Read: Mercury transit 2023: త్వరలో ఈ 4 రాశులవారు కుబేరులవ్వనున్నారు.. మీ రాశి ఉందా?


కర్కాటకం- తిరోగమన శుక్రుడు కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తాడు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీ సహచరులతోపాటు సీనియర్ల సపోర్టు లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. 


Also Read: Sun transit August 2023: సింహరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. అదృష్టమంటే ఈ మూడు రాశులిదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook