Shukra Vakri 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం లేదా తిరోగమనం చేయడం చేస్తాయి. శుక్రుడు కూడా త్వరలో తిరోగమనం చేయబోతున్నాడు. జూలై 23న శుక్రుడు కర్కాటక రాశిలో రివర్స్ లో కదలనున్నాడు. ఆగస్టు 07 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. అదే మీ కుండలిలో బలహీనంగా ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. శుక్రుడు తిరోగమనం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
తిరోగమన శుక్రుడు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు. మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 
సింహరాశి 
శుక్రుని అనుగ్రహంతో సింహ రాశి వారు తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీకు ప్రతి పనిలో సీనియర్ల సహకారం అందుతుంది. మీ కెరీర్ లో ఊహించని స్థాయికి వెళతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 
కన్య రాశి
తిరోగమన శుక్రుడు కన్యారాశి వారికి శుభఫలితాలను ఇస్తాడు. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. 


Also Read: Budh Surya Yuti 2023: మరో రెండు రోజుల్లో అరుదైన కలయిక.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..డబ్బే డబ్బు...


మకరరాశి
కర్కాటకంలో శుక్రుని తిరోగమనం మకరరాశి వారికి కలిసి రానుంది. మీ రాశి యెుక్క ఏడో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. మీ డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు.


Also Read: Shani Vakri 2023: రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook