Venus Transit May 2022: జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, శుక్ర గ్రహ అనుగ్రహం జీవితంలో సకల సౌఖ్యాలను ఇస్తుంది. అందువల్ల శుక్ర గ్రహాన్ని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం. అదే సమయంలో, కొంతమందికి పుట్టుకతో శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం ఉంది. కొద్ది రోజుల క్రితం శుక్ర గ్రహం మీన రాశిలోకి ప్రవేశించింది. ఈ శుక్ర సంచారం (Venus Transit May 2022) కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనది. మే 23 వరకు శుక్రుడు మీనరాశిలో ఉంటాడు. ఈ కాలంలో 3 రాశుల వారిపై శుక్రుడి దయ అపారంగా ఉంటుంది. దీని వల్ల వారు చాలా డబ్బు, ఆనందం పొందుతారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కావున మీన రాశిలోని శుక్రుడు ఈ రాశి వారికి చాలా లాభాన్ని ఇస్తాడు. ఈ వ్యక్తుల ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగం సాధించవచ్చు. వ్యాపారులు లాభపడతారు. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పని నెరవేరుతుంది. 


మిథునం (Gemini): శుక్రుని సంచారం మిథున రాశి వారికి వృత్తి-వ్యాపారాలలో బలమైన లాభాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం దొరుకుతుంది. ఇంక్రిమెంటల్ ప్రమోషన్ లభించవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదలను తెస్తుంది. మీ పని మెరుగ్గా ఉన్నందుకు ప్రశంసించబడతారు. మొత్తంమీద, ఈ సమయం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  


కర్కాటకం (Cancer): వీరి పనులు సులువుగా సాగుతాయి. మిమ్మిల్ని అదృష్టం వరిస్తుంది. మీరు జీవితంలోని ప్రతి రంగంలో ప్రయోజనం పొందేలా చేస్తుంది. ఆనందభరితంగా జీవిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆస్తుల క్రయ, విక్రయాలకు ఇది మంచి సమయం. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.


Also read: Palmistry: మీ అరచేతిలో శనిరేఖ ఉంటే.. పట్టిందల్లా బంగారమే! ఉందో లేదో తెలుసుకోండి ఇలా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook