Shukra Gochar 2022: కన్యారాశిలో శుక్ర సంచారం... నవరాత్రుల్లో ఈ రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్..
Venus Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశిచక్రాన్ని మారుస్తుంది. మూడు రోజుల కిందట శుక్రుడు తన రాశిని మార్చి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Shukra Gochar Impact In Navratri 2022: దేవీ నవరాత్రులు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. దీనికి రెండు రోజులు ముందు అంటే సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలోకి (Venus Transit in Virgo 2022) ప్రవేశించాడు. ఈ రాశికి అధిపతి బుధుడు. శుక్రుడు, బుధుడు మిత్రులు. దీంతో కన్యారాశిలో శుక్ర సంచారం నవరాత్రుల 9 రోజులపాటు కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries) - జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారికి శుక్రుని సంచారం స్పెషల్ అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వీరు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. వీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. ఆఫీసులో మీ ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.
వృషభం (Taurus)- శుక్ర సంచారం వల్ల నవరాత్రుల 9 రోజుల ఈ రాశివారికి కలిసిరానున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఇది తిరిగి వస్తుంది. సంతానం కలిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini): ఈ రాశివారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారు.ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి (Cancer) - ఈ రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ వనరుల ద్వారా వీరికి ఆదాయం సమకూరుతుంది. ఈ సమయం మీ కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా మీరు అప్పు ఉన్నట్లయితే దానిని తిరిగి చెల్లిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
సింహం (Leo) - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు వివిధ వనరుల ద్వారా డబ్బు పొందుతారు. మీరు ఏ రంగంలో అడుగుపెట్టిన విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది.
Also Read: అక్టోబర్‌లో రాశిని మార్చబోతున్న ఆరు గ్రహాలు.. ఈ 6 రాశులవారిపై పెను ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook