Venus Transit Negative Impact: దీపావళికి ఒక నెల ముందు సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు..ప్రేమ, శృంగారం, అందం, ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ కు కారకుడు. ఈ శుక్రుడి సంచారం (Venus Transit in Virgo 2022) కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభంగానూ ఉంటుంది. అయితే శుక్రుడి యెుక్క ఈ రాశిమార్పు కొన్ని రాశులవారి ఆదాయాన్ని పూర్తిగా నాశనం  చేస్తుంది. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ రాశులకు నష్టం
మేషరాశి (Aries): శుక్రుడిని మేషరాశికి చెందిన 2వ మరియు 7వ గృహాలకు అధిపతిగా భావిస్తారు. మీ జాతకంలో 6వ ఇంట్లోకి సంచార సమయంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మిమ్మల్ని వ్యాధులు, కష్టాలు చుట్టిముడతాయి. దీంతో మీరు అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


మిథునరాశి (Gemini); సెప్టెంబరు 24వ తేదీ శనివారం శుక్రుడు మీ జాతకంలో నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి యెుక్క  5వ మరియు 12వ ఇంటికి అధిపతి. శుక్రుడి సంచారం వల్ల మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇది మీ ఖర్చులను పెంచవచ్చు. అంతేకాకుండా కొందరు సౌకర్యాలు, విలాసాలు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ డబ్బును మీరు తెలివిగా ఖర్చు చేయండి. 


ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి యెుక్క 6వ మరియు 11వ ఇంటికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు.  ఇది ఈ రాశి యెుక్క 10వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది వృత్తి, వ్యాపారం, రాజకీయాలు, హోదాకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. దీనిని కర్మ భవ అని కూడా అంటారు. దీని కారణంగా మీరు కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆఫీసులో మీ సహచరులతో విభేదాలు రావచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 


కుంభరాశి (Aquarius): ఈ రాశి యెుక్క శుక్రుడు 4వ మరియు 9వ గృహాలకు అధిపతిగా పరిగణించబడతాడు. కాబట్టి శుక్ర సంచారం ఈ రాశిలోని ఎనిమిదవ ఇంట్లో జరుగుతుంది. దీంతో మీ లైఫ్ లో అనుహ్య ఘటనలో జరగవచ్చు. ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కోవల్సి రావచ్చు. ఆకస్మికంగా ఖర్చులు పెరగవచ్చు. 


మీన రాశి (Pisces): మీ రాశిలోని 3వ మరియు 8వ ఇంటికి శుక్రుడుని అధిపతిగా పేర్కొంటారు. శుక్రుడు సంచార సమయంలో ఈ రాశి యెుక్క ఏడవ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కెరీర్ లో సమస్యలను ఎదుర్కోంటారు. తప్పుడు నిర్ణయాలు మిమ్మిల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. అందుకే డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి. 


Also Read: Navratri Colours 2022: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook