Venus Transit 2022: డిసెంబర్ 29 నుంచి ఆ మూడు రాశులకు కావల్సినంత డబ్బు, ఉద్యోగాలు
Venus Transit 2022: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది చివర్లో శుక్రుడు రాశి పరివర్తనం జరగనుంది. శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా కొన్ని రాశులవారికి అంతులేని డబ్బు, లగ్జరీ జీవితం లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
జ్యోతిష్యశాస్త్రంలో శుక్రగ్రహాన్ని ధనానికి , విలాసానికి, ప్రేమ, రోమాన్స్‌కు కారకుడిగా భావిస్తారు. అందుకే ఇప్పుడీ ఏడాది చివరి రోజుల్లో శుక్రుడి స్థాన చలనం కారణంగా ఆ మూడు రాశులకు అంతులేని డబ్బు, ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి కన్పించనున్నాయి.
మీ కుండలిలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీ జాతకంలో ఎప్పుడూ డబ్బులకు లోటుండదు. ఈ జాతకులు జీవితమంతా సుఖ సంతోషాలు, విలాసాలతో జీవిస్తారు. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ప్రేమ కావల్సినంతగా ఉంటుంది. వీరి పర్సనాలిటీలో విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. డిసెంబర్ 29, 2022న శుక్రగ్రహం గోచారం జరగనుంది. డిసెంబర్ నెలలో శుక్రుడి రాశిపరివర్తనంతో మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ముఖ్యంగా మూడు రాశులకు అంతా శుభసూచకంగా ఉంటుంది.
వృషభరాశి Taurus
వృషభరాశికి గురువు శుక్రుడు. అందుకే శుక్రుడు ఈ రాశిపై ఎప్పుడూ అనుకూలంగా ఉంటాడు. డిసెంబర్ 29న జరగనున్న శుక్రగోచారం కారణంగా వృషభరాశివారికి అదృష్టం మెరిసిపోనుంది. ఈ జాతకుల కెరీర్‌లో భారీ విజయం లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. విభిన్న మార్గాల్నించి డబ్బులు అందుతాయి. విదేశీయాత్రలు చేయవచ్చు. ఏదైనా కీలకమైన వ్యవహారంలో విజయం అందుకుంటారు.
కన్యారాశి Virgo
శుక్రుడి రాశి పరివర్తనం కన్యారాశి జాతకుల ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది. వారి జీవితంలో ప్రేమ వికసిస్తుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. సంతాన సంబంధిత విషయాల్లో గుడ్‌న్యూస్ వింటారు. ఇంట్లో ఏదైనా మతపరమైన, శుభప్రదమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులారాశి Libra
తులారాశికి గురువు శుక్రుడు. శుక్రుడి గోచారం కారణంగా తులారాశి జాతకులకు అంతా శుభమే కలగనుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఏదైనా ఖరీదైన వస్తువులు కొంటారు. ఇళ్లు లేదా వాహనం కొనుగోలు కల పూర్తవుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆదాయం పెరుగుతుంది.
Also read: Rahu Ketu Transit 2023: రాహు-కేతు సంచారం.. 2023లో ఈ 4 రాశుల వారి జీవితాల్లో అన్ని కష్టాలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook