Venus Transit 2023: సింహరాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాభాలు షురూ..!
Venus Transit 2023: మరికొన్ని రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023 effect: మరో రెండు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది. ఈనెలలో కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. జూలై 07న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇతడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి సంచార సమయంలో మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి
శుక్రుని సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహరాశి
శుక్రుని రాశి మార్పు సింహరాశఇ వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అనుకున్న సమయానికి మీ పనులు పూర్తవుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Benefits of Vipreet Rajyog: 'బుధుడు' రాశిలో వ్యతిరేక రాజయోగం.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
ధనుస్సు రాశి
శుక్రుడి గోచారం ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీలో ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీరు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Shukra Vakri 2023 : జూలైలో తిరోగమనం చేయబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook