జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులకు అనుకూలంగా, కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో ప్రవేశించే సమయంలో గురుడు కూడా అదే రాశిలో ఉండటం వల్ల 4 రాశులపై ఊహించని నెగెటివ్ ప్రభావం పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన సంపద, ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యానికి కారకుడు శుక్రుడిగా భావిస్తారుయ ఆ శుక్రుడు ఫిబ్రవరి 15వ తేదీన రాశి పరివర్తనం చెంది..మీనరాశిలో ప్రవేశించనున్నాడు. మీనరాశిలో అప్పటికే ఉన్న గురుడి కారణంగా యుతి ఏర్పడుతుంది. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడినా..4 రాశులపై మాత్రం నెగెటివ్ ప్రభావం కన్పించనుంది. శుక్రుడి గోచారంతో ఏయే రాశులకు హాని కలగనుందో తెలుసుకుందాం..


మేషరాశి


శుక్రుడి గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం మేష రాశివారికి ఖర్చుల్ని పెంచుతుంది. బడ్జెట్ ప్రకారం చేసుకుంటే మంచిది. లేకపోతే సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చెడు ఆహార పదార్ధాలు మీ సమస్యను మరింత పెంచవచ్చు. ప్రేమ వ్యవహారంలో విభేదాలు రావచ్చు. పరస్పరం మనసు విప్పి మాట్లాడుకుంటే మంచిది.


మిధున రాశి


శుక్రుడి రాశి పరివర్తనం లేదా గోచారం కారణంగా మిధున రాశి జాతకుల కెరీర్‌లో సమస్యలు రావచ్చు. సహచరులతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. పనిచేసేచోట తక్కువ మాట్లాడితే మంచిది. లేకపోతే లేనిపోని సమస్యలు రావచ్చు. చాలామంది మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు.


తులా రాశి


తులా రాశివారికి కూడా శుక్రుడి రాశి పరివర్తనంతో ఖర్చులు పెరుగుతాయి. మీ కోర్కెలు పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమౌతారు. కోరుకున్నది లభించనప్పుడు నిరాశ చెందవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.


కుంభ రాశి


శుక్రుడి గోచారం కుంభరాశి జాతకులకు శుభ ఫలాల్ని ఇస్తుంది. గురుడితో కలిసి శుక్రుడి యుతి మాత్రం హాని కారకమౌతుంది. కెరీర్‌లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. మనసు చలిస్తుంటుంది. అధికారులతో మంచి సంబంధాలుండాలి. ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. 


Also read: Mangal Gochar 2023: మంగళ గ్రహ గోచారంతో హోలీ తరువాత ఆ 4 రాశులపై ఊహించని కనకవర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook