Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, విలాసానికి కారకంగా భావించే శుక్రుడు మళ్లీ రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ రాశి సంచారం మార్చి 7వ తేదిన జరబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ శుక్రగ్రహం సరిగ్గా మహాశివరాత్రికి ఒక్క రోజుకి ముందు శని రాశి అయిన కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ గ్రహం మార్చి 30వ తేది వరకు అదే రాశిలో సంచార దశలో ఉండబోతున్నాడు. దీని కారణంగా ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఈ రాశి సంచారం కారణంగా ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి:
శుక్రుడి సంచారం కుంభ రాశిలో జరగబోతోంది. కాబట్టి సొంత రాశివారి అయిన కుంభ రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం ఎంతో శృంగార భరితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే విద్యార్థులకు ఈ సమయం చాలా కలసి వస్తుంది. దీంతో పాటు ఒంటరి జీవితం గడుపుతున్నవారికి పెళ్లి ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మతపరమైన విషయాలపై ఆసక్తి పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


తుల రాశి:
శుక్రుడు శని రాశిలోకి సంచారం చేయడం వల్ల తుల రాశివారు చాలా అదృష్టవంతులవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వీరికి 4వ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరికి పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ రాశివారికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. కాబట్టి వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ప్రయాణాలు చేయడం వల్ల ఈ సమయంలో వీరికి చాలా కలసి వస్తుంది. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


వృషభ రాశి:
కుంభరాశిలో శుక్రుని సంచారం జరగడం కారణంగా వీరికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకండా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. దీంతో పాటు ఊహించని డబ్బులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య  సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారవేత్తలు, కళ, మీడియా, సినిమా రంగాల్లో పనులు చేసే వ్యక్తులు కూడా ఈ సంచార సమయంలో మంచి లాభాలు పొందుతారు. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter