Venus Transit: ఈ రాశులవారిపై శుక్ర గ్రహం ఎఫెక్ట్..వీరి జీవితాలు శృంగారభరితం..
Venus Transit: శుక్ర గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కోరికున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా విజయాలు సాధిస్తారు.
Venus Transit: శుక్ర గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితంలో ఆనందం శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని లగ్జరీ సౌకర్యాలకు సూచికగా పరిగణిస్తారు కాబట్టి శుక్రుడు రాశి సంచారం చేయడం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే డిసెంబర్ 25న శుక్ర గ్రహం ఉదయం ఆరు గంటలకు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేసింది. ఈ గ్రహం జనవరి 18 వరకు సంచార దశలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికిపై శుక్రుడి ప్రభావం:
మేషరాశి:
మేషరాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కెరీర్ పరంగా జీవితంలో అనేక రకాల లాభాలు పొందుతారు. ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల భవిష్యత్‌లో లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓపికతో ఉండడం చాలా మంచిది. మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు. వారితో మాట్లాడి పరిష్కరించుకోవడం చాలా మంచిది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్రుడు రాశి మారడం కారణంగా అనేక రకాల లాభాలు పొందుతారు. ఈ సమయం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం పెరడం కారణంగా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఒంటరి జీవితం గడుపుతున్నవారు శుభవార్త అందుకుంటారు. వైవాహిక జీవితం గడుపుతున్నవారు భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
కర్కాటక రాశి:
శుక్ర గ్రహం సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా సాగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారు ఒకరితో ఒకరు సరదాగా ఉంటారు. దీంతో పాటు వీరు వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter