హోలీ అనంతరం 5 రాశులకు మహర్దశ పట్టనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. లగ్జరీ అనుభవించడమే కాకుండా భారీగా డబ్బులు సంపాదిస్తారు. సకల సంపదలు లభిస్తాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడు త్వరలో మేష రాశిలో ప్రవేశించనున్నాడు. మార్చ్ 12వ తేదీ శుక్రుడి మేష రాశి ప్రవేశం సమయంలో అప్పటికే రాహువు ఉపస్థితుడై ఉన్నాడు. దాంతో అంటే హోలీ అనంతరం శుక్రుడు మేషరాశిలో ప్రవేశించగానే..ఈ 5 రాశులకు ఊహించని లాభాలుంటాయి. సుఖ సంతోషాలు, లగ్జరీకు కారకుడిగా భావించే శుక్రుడు త్వరలో అంటే మార్చ్ 12న మేషరాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే ఈ రాశిలో రాహువు ఉన్నందున ఈ 5 రాశులపై ఊహించని కనకవర్షం కురుస్తుంది. ఆష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.


మేషరాశి


శుక్రుడు మేషరాశిలో ప్రవేశించనుండటం వల్ల ఈ రాశి వారికి సహజంగానే చాలా లాభం కలగనుంది. వ్యక్తిత్వం కూడా మారుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రేమ సంబంధాలు బాగుంటాయి.పెళ్లైనవారికి భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. 


మిథున రాశి


మిథున రాశి వారికి శుక్రుడి గోచారం ప్రభావం పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు సాగుతాయి. ఇది భవిష్యత్తులో లాభం కల్గిస్తుంది. పిల్లల తరపు నుంచి శుభవార్త వింటారు. శుక్రుడు గోచారం విద్యార్ధులకు చాలా బాగుంటుంది.


సింహ రాశి


సింహరాశి వారికి శుక్రుడి గోచారం ప్రయోజనం కల్గిస్తుంది. పెళ్లైనవారికి ఈ గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే..ఈ సమయం చాలా మంచిది. లాభం కల్గిస్తుంది. సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం అణ్వేషించేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.


ధనస్సు రాశి


శుక్రుడి గోచారం ధనస్సు రాశివారికి అత్యంత శుభసూచకం. విద్యార్ధులకు ప్రత్యేకించి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహితులు శుభవార్త వింటారు. కుటుంబం లేదా బయట ఏదైనా వివాదం ఉంటే సమసిపోతుంది. ఆర్ధిక కష్టాలు దూరమౌతాయి. విభిన్న పద్ధతుల ద్వారా డబ్బులు సంపాదించగలరు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. 


మీన రాశి


మీన రాశివారిపై శుక్రుడి కటాక్షం పూర్తిగా ఉంటుంది. ఈ సందర్భంగా డబ్బులు ఆదా చేస్తారు. అత్తారింటి తరపు నుంచి సంబంధాలు మెరుగుపడతాయి. అందర్నీ ఆకర్షించగలరు. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. 


Also read: Rajyogam: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook