Shukra Gochar 2023 in October: అష్టగ్రహాల్లో శుక్రుడు కూడా ఒకడు. ఇతడిని శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడు ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. సాధారణంగా శుక్రుడు 25 రోజులకొకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. అక్టోబరు 02 వరకు అదే రాశిలో ఉండి ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రాశి మార్పు వల్ల మూడు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి
ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో ఈ రాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సింహరాశి వారి దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
తులారాశి
ఈ రాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల తులరాశి వారు చాలా బెనిఫిట్స్ పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
వృషభం
శుక్రుడి రాశి మార్పు వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.  మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది.


Also Read: Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశులవారికి కుబేర యోగం.. వీరు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook