Shukra Gochar 2023: వచ్చే నెలలో అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
Venus Transit 2023: మరో 10 రోజుల్లో శుక్రుడి తన రాశిని మార్చనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ప్రస్తుతం శుక్రుడు రాహువుతో కలిసి మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 06వ తేదీన తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రుడి రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర గోచారం ఈ రాశులకు వరం
వృషభం- శుక్రుని సంచారం ఈరాశి యెుక్క లగ్న గృహంలో ఉండబోతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మిమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెట్టలేరు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు మీ భార్య నుండి ప్రత్యేక ప్రేమను పొందుతారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.
సింహ రాశి- శుక్రుడు ఈ రాశి యెుక్క పదో ఇంటి గుండా ప్రయాణిస్తున్నాడు. మీరు ఏ పనినైనా ఉత్సాహంగా చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో ప్రమోషన్ దక్కుతుంది. మీరు వర్క్ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం- ఈ రాశి యెుక్క నాల్గో ఇంట్లో శుక్ర గోచారం జరగబోతుంది. దీంతో మీరు శుభఫలితాలను పొందుతారు. మీరు ఈ సమయంలో ఏదైనా విలువైన దానిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పనిలోని అడ్డంకులన్నింటినీ అధిగమిస్తారు. మీరు మీ సహోద్యోగులలో ఒకరితో ప్రేమలో పడే అవకాశం ఉంది.
Also Read: Mercury transit 2023: బుధ గోచారం ప్రభావం, సరిగ్గా 5 రోజుల్లో ఈ 3 రాశులకు అపార ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook