Venus Transit 2022: మరో 48 గంటల్లో ఈ 5 రాశుల వారికి శుభకాలం మొదలు.. ఇక పట్టిందల్లా బంగారమే!
Venus in Cancer, Venus Transit 2022 august 7 in Cancer. శుక్ర గ్రహం ఆగస్టు 7వ తేదీన ఉదయం 5 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. మరో 48 గంటల్లో ఈ 5 రాశుల వారికి శుభకాలం ఆరంభం అవుతుంది.
Venus Transit 2022 august 7 in Cancer: జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం చాలా ప్రభావంతమైంది. ప్రేమ, శృంగారం, సుఖం, వైవాహిక ఆనందం, అందం, కళలకు శుక్ర గ్రహం ప్రామాణికంగా పరిగణించబడుతుంది. ఓ వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం బలంగా ఉంటే.. అతడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ముఖ్యంగా ప్రేమలో విజయం సాధిస్తాడు. అయితే శుక్రుని సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. మరోసారి శుక్ర గ్రహం తన రాశిని మార్చబోతోంది. దాంతో ఈసారి ఐదు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండనుంది.
మరోసారి శుక్ర గ్రహం తన రాశిని మార్చబోతోంది. శుక్ర గ్రహం ఆగస్టు 7వ తేదీన ఉదయం 5 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఆగస్టు 31 వరకు కర్కాటక రాశిలో ఉండి.. ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 25 రోజులు ఈ 5 రాశుల (మేషం, వృషభం, మిథునం, కన్య, తుల) వారికి చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపారఎం విద్యా రంగంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి.
మేషం:
మేష రాశి వారికి శుక్రుని సంచారం చాలా శుభప్రదంగా ఉంది. మేష రాశి వారు ఈ 25 రోజులు తమ కెరీర్‌లో భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి, జీతాలు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పై అధికారులు మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
వృషభం:
శుక్రుని సంచారం వృషభ రాశి వారికి పెద్ద కానుక కానుంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఇక వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మిథునం:
శుక్రుడు రాశిలో మార్పు మిథున రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో భాగస్వామి దొరిగే అవకాశం ఉంది. ఏ పనిలో అయినా శుభ ఫలితాలు ఉంటాయి.
కన్య:
శుక్రుని స్థానం మారడం వల్ల కన్య రాశి వారికి చాలా శుభప్రదంగా మారనుంది. చేసే పనులలో విజయం సాధిస్తారు. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. కారును కొనుగోలు చేయవచ్చు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
తుల:
శుక్రు రాశి మార్పు తుల రాశి వారికి వృత్తిలో బలమైన పురోగతిని ఇస్తుంది. తుల రాశి వారికి పనిలో ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందవచ్చు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
Also Read: చరిత్ర సృష్టించిన సుధీర్.. పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం!
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook