Venus transit 2023: కర్కాటకంలో శుక్ర సంచారం.. జూన్‌లో ఈ 4 రాశుల ఖర్చులు పెరగడం ఖాయం..
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రాచార్యుడిని రాక్షసుల గురువుగా పిలుస్తారు. ఇతడు లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. ఈనెల 30న శుక్రుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇతడు జూలై 7 వరకు ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి యెుక్క సంచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. వచ్చే నెలలో శుక్రుడి రాశి మార్పు 5 రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
ధనస్సు
శుక్రుడి రాశి మార్పు కారణంగా ధనస్సు రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ పనులన్నీ వాయిదా పడతాయి.
కుంభ రాశి
శుక్ర సంచారం మీకు అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. జంక్ పుడ్ కు దూరంగా ఉండండి. వీలైతే వ్యాయామం చేయండి. ఏదైనా ప్రారంభించడానికి ఇది తగిన సమయం కాదు. మీ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి.
వృషభ రాశి
ఈ సమయంలో వృషభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాసం ఉంది. మీ ప్రేమ జీవితం బాగుండదు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది.
సింహం
శుక్రుడి సంచారం వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహచరులతో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు చాలా డబ్బును నష్టపోయే అవకాశం ఉంది. మీరు మోసపోయే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫం లభించదు.
Also Read: Saturn Mars Conjunction 2023: జూన్ 30 వరకు ఈ రాశుల జీవితం గందరగోళం.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook