Venus transit 2023: జూలై 7న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 2 రాశులకు డబ్బే డబ్బు..
Shukra Rashi Parivartan 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు చంద్రునిచే పాలించబడే కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అనంతరం జూలై 7, 2023 ఉదయం 3:59 గంటలకు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాుడు. అదే నెల 23న సింహరాశిలో శుక్రుడు తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడి గోచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
ఈరాశి యెుక్క రెండవ మరియు ఏడవ ఇంటికి శుక్రుడిని అధిపతిగా భావిస్తారు. సింహరాశిలో శుక్రుని సంచారం వల్ల మీ లవ్ సక్సెస్ అవుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. మీ శృంగార జీవితం బాగుంటుంది. మీ కెరీర్ మలుపు తిరుగుతుంది. ఆర్కిటెక్చర్, డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు కళాత్మక రంగాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మేషరాశి వారు అన్నం ఖీర్ తయారు చేసి దుర్గామాతకు సమర్పించడం వల్ల శుక్రుడి ప్రసన్నం అవుతాడు.
Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి బృహస్పతి.. ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం!
వృషభ రాశి
వృషభ రాశివారి జాతకంలోని ఆరవ ఇంటికి శుక్రుడు అధిపతి. సింహరాశిలో శుక్రుడి గోచారం వల్ల మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ హెల్త్ బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ముగిసిపోతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. వృషభ రాశి వారు శుక్ర మంత్రం పఠించడం శుభప్రదం.
Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు 'మహా సంయోగం'.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook