Shukra Gochar 2023: మరో 2 రోజుల్లో శుక్రుడి రాశి మార్పు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Shukra Gochar 2023: త్వరలో ఒక పెద్ద గ్రహం తన రాశిని మార్చబోతోంది. కొన్ని రాశుల వారు లాభాలను గడిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Parivartan Effects On Zodiac Signs: మన ఫ్యూచర్ ను జ్యోతిష్యశాస్త్రం ఇట్టే చెప్పేస్తోంది. ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 22న శుక్రుడు తన రాశిని మార్చి.. కుంభరాశిలోకి (Venus transit in kumbh 2023)ప్రవేశించనున్నాడు. లవ్, రొమాన్స్, అందం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడి స్థానంలో మార్పు కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభం (Taurus): శుక్రుని సంచారం వల్ల వృషభరాశి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో గొప్ప పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శుక్ర గోచారం వల్ల జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగంలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.
కన్య (Virgo): శుక్రుడి సంచారం వల్ల మీరు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులు భారీగా లాభపడతారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి.
మేషరాశి (Aries): మీరు పని నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. శుక్ర సంచారం వల్ల ప్రభావితమైన మేష రాశి వారికి శుభవార్తలు అందుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
సింహరాశి (Leo): రాబోవు శుక్ర సంచారం సింహ రాశి వారికి వ్యాపారంలో వృద్ధిని కలిగిస్తుంది. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు సంయమనం పాటించాలి.
Also Read: Mangal Margi 2023: జనవరిలో మంగళదేవుడి సంచారం.. ఈ రాశులకు పండగే పండుగ.. డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.