Shukra Gochar 2023: మే 02న మిథున రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు..
Shukra Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడి రాశి మార్పును శుభప్రదంగా భావిస్తారు. వచ్చే నెల 02న శుక్రుడు వృషభరాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Venus transit 2023: ఆస్ట్రాలజీలో అందమైన గ్రహంగా శుక్రుడికి పేరు ఉంది. అంతేకాకుండా ఇతడి అనుగ్రహం మీకు ఉంటే దేనికీ లోటు ఉండదు. మీ జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు డబ్బు మెుదలైన వాటికి కొదవ ఉండదు. హిందూ క్యాలెండర్ ప్రకారం, శుక్రుడు మే 02వ తేదీ మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రాశిలో మే 30 వరకు ఉంటాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు ఎక్కువ ప్రయోజనాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిధునరాశి
మిథునరాశి వారికి శుక్ర సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. రచన, జర్నలిజం లేదా విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
కన్య రాశి
కన్య రాశి వారికి శుక్ర సంచారం ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను ఇస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది.
Also read: Budh Asta 2023: మరో మూడు రోజుల్లో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు ప్రతి పనిలో విజయం..
కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కృషికి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో మీరు లాటరీ లేదా పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం విస్తరించవచ్చు. మీకు ధనలాభం ఉంటుంది.
వృషభం
శుక్రుడి సంచారం ఈ రాశివారికి మేలు చస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ కలలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. శుక్రుడి సంచార సమయంలో మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పెట్టుబడుల పెట్టడానికి ఇదే మంచి సమయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook