COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vijayadashami 2024: ప్రతి సంవత్సరం అశ్విని శుక్లపక్షమి దశమి తిధి రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. అయితే పురాణాల ప్రకారం దసరా పండగను జరుపుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదట శ్రీరాములు ఈరోజే రావణున్ని సంహరించాడు. ఇక రెండవది దుర్గామాత పది రోజులపాటు ఘోరమైన యుద్ధాన్ని చేసి మహిషాసురుని సంహరించింది. ఇలా చెడుపై మంచి గెలిచినందుకు కాను విజయదశమి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ పండగకు మరింత ఓ ప్రాముఖ్యత ఉంది.. ఎందుకంటే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు చేయడం కారణంగా యోగాలు ఏర్పడబోతున్నాయి. దసరా పండగ సమయంలో శుక్రుడు తులా రాశిలో ఉండడం వల్ల ఎంతో పవర్ఫుల్ మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుంభ రాశిలో శని ఉండడం వల్ల శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


మకర రాశి: 
ఈ రెండు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం కారణంగా మకర రాశి వారికి దసరా పండగ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా శని కూడా మీ ఇంటిని సందర్శించే అవకాశాలున్నాయి. దీని కారణంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరే అదృష్టాన్ని పొందుతారు. దీంతోపాటు వీరికి బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


తులారాశి:
తులారాశి వారికి మాళవ్య రాజయోగం ఏర్పడడం కారణంగా జీవితమే మారుతుంది. దీని కారణంగా వీరికి దసరా పండుగ రోజు నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే చాలా వరకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వీరు కొత్త జాబ్ ఆఫర్స్ కూడా పొందుతారు. నీకు ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే పెళ్లిళ్లు కూడా జరగవచ్చు. వైవాహిక జీవితం కూడా ప్రారంభమవుతుంది. ఇక ఎప్పటినుంచో చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని సమస్యల తొలగిపోయి జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తారు. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


వృషభ రాశి: 
వృషభ రాశి వారికి కూడా ఈ రెండు రాజయోగాలు అద్భుతంగా ఉంటాయి. దసరా పండుగ నుంచి వీరికి అనుకున్నది. అనుకున్నట్టు జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిన వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే వీరికి ఓర్పు పెరగడమే కాకుండా ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఎప్పటినుంచో వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆశించిన ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఇక సమస్యలు కూడా వెంటవెంటనే దూరం అవుతాయి. కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఆనందంగా జీవిస్తారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.