Vijayadashami 2024 Lucky Zodiac Sign: చెడుపై విజయం సాధించినందుకు గాను భారతీయులకు ప్రతి సంవత్సరం విజయదశమిని జరుపుకుంటారు. అందుకే ఈ పండగకి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంవత్సరం దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. నవరాత్రుల్లో తొమ్మిదో రోజు ఈరోజు ముగుస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వచ్చే దసరా పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మాలవ్య రాజయోగంతో పాటు ఎంతో శక్తివంతమైన కొన్ని రాజయోగాలు ఏర్పడి ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రవణా నక్షత్రం కావడంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా గ్రహాలు శుభస్థానంలో ఉన్న మూడురాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దసరా సమయంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో అత్యధిక లాభాలు పొందబోయే లక్కీ రాశులు ఎవరు? వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశి :
మకర రాశి వారికి విజయదశమి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే కెరీర్‌కు సంబంధించిన జీవితం పై క్లారిటీ కూడా వస్తుంది. వీరికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగివస్తుంది. దీంతోపాటు ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. పాత మిత్రులను కూడా సరదాగా కలిసే అవకాశాలున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో గొప్ప అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. దీనికి కారణంగా త్వరలోనే వీరికి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దసరా పండుగ రోజున మకర రాశి వారికి అనుకున్న లాభాలు కలుగుతాయి.


వృషభ రాశి :
వృషభ రాశి వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర పండుగ రోజున వీరికి అద్భుతమైన అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే భారీగా లాభాలను అర్జించే అదృష్టాన్ని కూడా పొందగలుగుతారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి వచ్చే రోజులన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక ఉద్యోగాలపరంగా చూస్తే వృషభ రాశి వారికి ఊహించని ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీని కారణంగా కొత్త బాధ్యతలకు కూడా స్వీకరించే ఛాన్స్ ఉంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా పెరిగి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఈ సమయంలో వీరు ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. 


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


తులారాశి :
తులా రాశి వారికి విజయదశమి ఎన్నో సంతోషాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహాలు నిశ్చయం కూడా కావచ్చు. ఇక ఒంటరిగా జీవిస్తున్న వారికి పండగ చేసుకునే రోజులు కూడా వస్తాయి. ప్రేమ ప్రతిపాదనలకు సంబంధించిన కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఆఫీసుల్లో ఉన్న కష్టాలన్నీ తీరబోతున్నాయి. అలాగే వీరికి సీనియర్ల సపోర్టు లభించి.. ఎలాంటి లాభాలైన పొందే అద్భుతమైన అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా తులా రాశి వారు కుటుంబ పరంగా కూడా ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కూడా పురోగతి లభిస్తుంది. దీంతోపాటు కష్టపడి పని చేసిన వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.