Ganesha Chaturthi 2022: ఏ పని మెుదలుపెట్టాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా గణేశుడిని పూజిస్తారు. హిందూమతంలో వినాయకుడికి అంత విశిష్ట ప్రాధాన్యత  ఉంది. గణపతి (Lord Ganesha) అనుగ్రహం ఉంటే మీ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సులువుగా పూర్తవుతుంది. కొంత మందికి పుట్టినప్పటి నుండే వినాయకుడి అనుగ్రహం ఉంటుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయకుడికి ఇష్టమైన రాశులు ఇవే..
మేషం (Aries) - మేష రాశి వారికి వినాయకుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అంగారకుడి ప్రభావం వల్ల వీరికి ధైర్యసాహసాలు ఎక్కువ. దీంతో వీరు తమ పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఈరాశివారు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాల్లో వచ్చినా ధైర్యంతో వాటిని పూర్తిచేస్తారు. అందుకే వీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. 


మిథునరాశి (Gemini) - జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహం గణేశునికి సంబంధించినది. మిథునరాశిని పాలించే గ్రహం మెర్క్యురీ. అందుకే ఈ రాశివారికి గణేశుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరికి తెలివితేటలు ఎక్కువ, బాగా మాట్లాడతారు కూడా. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. 


మకరం (Capricorn)- మకర రాశికి అధిపతి శని దేవుడు. అయితే ఈ రాశివారికి శనితోపాటు గణేశుడి కటాక్షం కూడా ఉంటుంది. ఈ రాశివారు చాలా తెలివైన వారు మరియు మంచి స్కిల్స్ కలిగి ఉంటారు. వీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. 


Also Read: Lord Ganesh: వినాయకుడి పుట్టుక వెనుకున్న ఆసక్తికర కథ ఇదే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook