Viral Video Drunkard Man Luckily Saved: వర్షాకాలంలో రోడ్డుపై నడిచేటప్పుడు లేదా బైక్‌పై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీటితో నిండిన రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మ్యాన్ హోల్స్‌లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఉధృతంగా ప్రవహించే నాలాల్లో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. తాజాగా ఒకచోట ఓ తాగుబోతు వ్యక్తి తాగిన మత్తులో తడబడుతూ అడుగులేసి నాలాలో పడిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడున్నవారు గమనించి అతన్ని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వైరల్ వీడియోను గమనిస్తే... ఓ వ్యక్తిని ఎవరో అక్కడ బైక్‌పై డ్రాప్ చేశారు. అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడు. బైక్‌పై ఉన్న వ్యక్తితో సరదా మాటలేవో మాట్లాడి.. అతను వెళ్లిపోగానే ముందుకు అడుగులు వేశాడు. ఆ ప్రదేశంలో రోడ్డు నీటితో నిండి ఉంది. దాన్ని ఆనుకునే ఒక నాలా కూడా ఉంది. మద్యం మత్తులో ఉన్న అతను తడబడుతూ ముందుకెళ్లాడు. అలా నాలా సమీపానికి వెళ్లగానే బ్యాలెన్స్ కోల్పోయి అందులో బొక్కబోర్లా పడ్డాడు.


వెంటనే అక్కడున్న కొందరు అతన్ని గమనించి పరిగెత్తుకెళ్లారు. నాలాలో కొట్టుకుపోతున్న అతన్ని పైకి లాగి రక్షించగలిగారు. నాలా నీళ్లు మింగడంతో అతని కడుపుపై చేతులతో గట్టిగా ఒత్తి ఆ నీళ్లు కక్కించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. తాగుబోతు అని వదిలేయకుండా అతని ప్రాణాలు రక్షించినవారిని అభినందిస్తున్నారు. 'కోచ్ మంజునాథ్ కిక్ బాక్సర్' అనే ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 3 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.



Also Read: Munugode ByPoll Live Updates: ఈనెల 21న మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ.. టీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీలో చేరికలు


Also Read: ZIM vs IND: వైరల్ వీడియో.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బిక్క మొహం వేసిన శిఖర్ ధావన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook